బ్యాంకు దోపిడీకి విఫలయత్నం: దొంగల దాడిలో ఇద్దరు సెక్యురిటీ గార్డుల మృతి
దొంగల దాడిలో ఇద్దరు సెక్యురిటీ గార్డుల మృతి
ఢిల్లీ శివార్లలోని నొయిడాలో దొంగలు రెచ్చిపోయారు. సెక్టార్ 1లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించిన దొంగలు.. అందుకు అడ్డం వచ్చిన ఇద్దరు సెక్యురిటీ గార్డులను హతమార్చారు. బ్యాంకు దోపిడీ కోసం వచ్చిన గుర్తుతెలియని దుండగులను అడ్డుకునే ప్రయత్నంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఈ సెక్యురిటీ గార్డులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. బ్యాంకు దోపిడీ విఫలమవడంతో దుండగులు వెంటనే బ్యాంకు నుంచి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకొద్దిసేపట్లోనే అప్‌డేట్ చేయడం జరుగుతుంది.