Udaipur murder case: కన్హయ్య లాల్ హంతకుడికి ఐసీస్ ఉగ్రవాదులతో లింక్? ఉదయ్ పూర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..
Udaipur Beheaded Case: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఉదయ్ పూర్ ట్రైలర్ దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుగోల్పే నిజాలు తెలుస్తున్నాయి.
Udaipur Beheaded Case: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఉదయ్ పూర్ ట్రైలర్ దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుగోల్పే నిజాలు తెలుస్తున్నాయి. ఇద్దరు దుండగుల్లో ఒకడైన రియాజ్ అన్సారీకి ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో ఉన్న సంబంధం తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. ఇద్దరు హంతకులు కన్హయ్యాలాల్ ను చంపే ముందు తర్వాత వీడియో తీశారు. హత్య చేసిన తర్వాత వీడియో బయటికి విడుదల చేశారు. ఐసీస్ ఉగ్రవాదులు కూడా అలానే చేస్తుంటారు. ఎవరినైనా హత్య చేస్తే.. తర్వాత దానికి సంబంధించిన వీడియోను ఐసీస్ ఉగ్రవాదులు విడుదల చేస్తుంటారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ప్రకటించుకుంటారు.
ఉదయ్ పూర్ లోనూ దర్జీని అతి కిరాతకంగా తలనరికి చంపిన దుండగులు.. ఆ ఘటనను వీడియో తీశారు. తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు కన్పయ్యాలాల్ ను తామే చంపేశామంటూ మరో వీడియో విడుదల చేశారు. టైలర్ ను చంపేసిన కత్తిని వీడియోను చూపించారు కిరాతకులు. ఈ ఘటన ఐసీస్ ఉగ్రవాదులను పోలి ఉండటంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. దీంతో దుండగల్లో ఒకరైన రియాజ్ అన్సారీకి ఐసీస్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయి. ఐసీస్ లింకులు బయటపడటంతోనే కేసును ఎన్ఐఏకి అప్పగించారని తెలుస్తోంది.
2021లో రాజస్థాన్‌లోని టోంక్ నగరంలో నివాసముంటున్న ముజీబ్ అబ్బాసీని.. రియాజ్ అన్సారీ మూడుసార్లు కలిశారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవల ముజీబ్ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని అరెస్టయ్యాడు. అతడితో పాటు మధ్యప్రదేశ్‌లోని రత్లాంలోనూ పలువురుని అరెస్ట్ చేశారు. దీంతో గతంలో ముజీబ్ అబ్బాసీని కలిసిన రియాజ్ అన్సారీకి ఉగ్రవాద లింకులు ఉన్నాయనే అభిప్రాయం బలపడుతోంది. రియాజ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు సంకేతం వచ్చేలా ఉన్న ఫోటోలను పోలీసులు గుర్తించారని సమాచారం. రియాజ్ ఇస్లాం యొక్క బరేల్వి ఆచారాలను పాటిస్తారు. అది పాకిస్తాన్ యొక్క రాడికల్ కక్ష దావత్-ఎ-ఇస్లామీకి అనుబంధమని తెలుస్తోంది. రియాజ్ కు సంబధించి బయటికి వస్తున్న అని విషయాలు ఉగ్రవాద మూలాలకు లింకులు ఉండటంతో .. ఉదయ్ పూర్ ఘటన హంతకుడికి ఐసీస్ తో సంబంధాలు ఉన్నాయనే వాదన బలపడుతోంది.
ఉదయ్‌పూర్‌లో టైలర్‌గా పనిచేస్తున్న కన్హయ్యాలాల్‌ను మంగళవారం ఇద్దరు వ్యక్తులు కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. ఈ హత్య తర్వాత, హంతకులు వీడియోను విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా చంపేస్తామని హంతకులు బెదిరించారు. నిందితులు రియాజ్, గౌస్ మహ్మద్‌లు మంగళవారం మధ్యాహ్నం కన్హయ్యలాల్ దుకాణానికి వచ్చారు. బట్టల కొలత ఇస్తాననే నెపంతో వచ్చి... షాపులోనే అతడిని కిరాతకంగా హత్య చేశారు. హత్య అనంతరం కత్తి ఊపుతూ వీడియో తీశారు. మహ్మద్ ప్రవక్త గురించి చెడుగా మాట్లాడితే ఇలాగే చంపబడతారని నినాదాలు చేస్తూ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం వారిద్దరూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ లో రియాజ్, గౌస్‌లను పోలీసులు పట్టుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.