UGC NET Exam Date 2021: నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) యూజీసీ నెట్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో యూజీసీ నెట్ డిసెంబర్ 2020 పరీక్షలు(UGC NET December Cycle) మే 2021 పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA Latest Updates) మే 2వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు యూజీసీ నెట్ డిసెంబర్ 2020 పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. యూజీసీ నెట్ 2021 పరీక్షా తేదీలు(UGC NET 2021 Exam Dates) వరుసగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14 మరియు 17 తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారు.


Also Read: CBSE Board Exam 2021: మరికాసేపట్లో సీబీఎస్ఈ Class 10, Class 12 Time Tables విడుదల


 


 



 



జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో షిప్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) ప్రతి ఏడాది రెండు పర్యాయాలు యూజీసీ నెట్ పరీక్షలు (UGC NET Exams) నిర్వహిస్తుంది. జూన్ నెలలో తొలి పరీక్ష, డిసెంబర్ నెలలో రెండో పర్యాయం నెట్ పరీక్ష జరుగుతుంది. 


 


ఇది కంప్యూటర్ ఆధారిత  పరీక్ష. మొత్తం 2 పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు, 100 మార్కులు.. పేపర్ -2లో 100 మల్టీ ఛాయిస్ ప్రశ్నలు, 200 మార్కులు కేటాయించారు. యూజీసీ నెట్ పరీక్ష 3 గంటలపాటు జరుగుతుంది. డిసెంబర్ 2020లో నిర్వహించాల్సిన పరీక్షను ఈ ఏడాది మే నెలలో నిర్వహిస్తున్నారని తెలిసిందే.


Also Read: Samsung Galaxy A72 Price In India: మార్కెట్‌లోకి రాకముందే శాంసంగ్ ఏ72 ధర, ఫీచర్స్ లీక్



ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభం కానున్న యూజీసీ నెట్ మే 2021 పరీక్ష దరఖాస్తుల తుది గడువు మార్చి 3న ముగియనుంది. యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు అవకాశం లభిస్తుంది. గతేడాది కరోనా కారణంగా ఒక్కసారే పరీక్ష నిర్వహించారు.


Also Read: EPFO ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ జమ, EPF Passbook Password మరిచిపోతే ఇలా చేయండి 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook