Aadhaar Card: ఆధార్ చట్టం ఉల్లంఘిస్తే ఇక భారీ జరిమానా తప్పదు..ఎంతో తెలుసా
Aadhaar Card: ఆధార్ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చేతికి కేంద్ర ప్రభుత్వం ఓ బ్రహ్మాస్త్రాన్ని అందించింది. ఇకపై ఆధార్ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలే మరి.
Aadhaar Card: ఆధార్ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చేతికి కేంద్ర ప్రభుత్వం ఓ బ్రహ్మాస్త్రాన్ని అందించింది. ఇకపై ఆధార్ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలే మరి.
ఆధార్ చట్టాన్ని(Aadhaar Act)ఉల్లంఘించినవారిపై ఇక నుంచి కఠిన చర్యలు, భారీ జరిమానా తప్పదు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆధార్ చట్టానికి అధికారులు కల్గిస్తోంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా చేతికి కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రం అందించింది. దీని ప్రకారం ఆధార్ చట్టం ఆమోదించిన రెండేళ్ల తరువాత కోటి రూపాయల వరకూ జరిమానా విధించేందుకు యూఐడీఏఐకు వీలు కల్పించేలా నిబంధనల్ని ప్రభుత్వం నోటిఫై చేసింది.
కేంద్ర ప్రభుత్వం(Central Government) జారీ చేసిన నియమనిబంధనల ప్రకారం.. యూఐడీఏఐ ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవచ్చు. న్యాయనిర్ణేత అధికారులకు ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలు లేదా వ్యక్తులపై విచారణ జరిపి 1 కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశాన్ని కల్పించింది. న్యాయనిర్ణేత అధికారులు ఇచ్చిన తీర్పుపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే సదరు సంస్థలు టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించవచ్చు. ఈ నిబంధనలను తీసుకొనిరావడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్(Aadhaar), ఇతర శాసనాల సవరణ బిల్లు, 2019కి ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ చట్టాలను అమలు చేయడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి రెగ్యులేటర్‌తో సమానమైన అధికారాలు లభించాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూజర్ల డేటకు మరింత రక్షణ లభిస్తుంది.
Also read: Ancient City: సముద్ర గర్భంలో 2 వేల ఏళ్లనాటి ప్రాచీన నగరం విశేషాలివీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook