Madhya Pradesh New CM: మధ్యప్రదేశ్​ నూతన ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి  మోహన్‌ యాదవ్‌ ఎంపికయ్యారు. బీజేపీ నేత, ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్‌ యాదవ్‌ కు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు కట్టబెడుతూ బీజేపీ (BJP) అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ వర్గానికి చెందిన మోహన్ యాదవ్ పేరును బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆమోదించారు. అంతేకాకుండా ఇద్దరు డిప్యూటీ సీఎంల పేర్లును కూడా ప్రకటించారు. రేవా ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా, మాజీ మంత్రి జగదీశ్‌ దేవరా ఉప ముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారు.  కాగా నరేంద్ర సింగ్ తోమర్ స్పీకర్ గా వ్యవహారించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 మార్చి 1965న ఉజ్జయినిలో జన్మించారు మోహన్ యాదవ్. 2013లో ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు మోహన్ యాదవ్. 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2020లో అప్పటి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ బినెట్ లో ఆయన విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. వరుసగా మూడోసారి విజయం సాధించారు. మోహన్‌ యాదవ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో కూడా మంచి అనుబంధం ఉంది. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ను పక్కనబెట్టి కొత్త వ్యక్తికి సీఎం బాధ్యతలు ఇవ్వడం అక్కడి రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 230 స్థానాలలకు 163 స్థానాల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. 


Also Read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌పై తొలగిన సస్పెన్స్, ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్, స్పీకర్ పదవిలో మాజీ సీఎం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook