కేంద్ర బడ్జెట్‌కు అప్పుడే ముహూర్తం ఖరారైందా ?
కేంద్ర బడ్జెట్‌కు అప్పుడే ముహూర్తం ఖరారైందా ?
న్యూఢిల్లీ: నేడు దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ జూలై మొదటి వారంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అయ్యే పూర్తి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ.. అది ఐదు నెలల కోసం మాత్రమే ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అనే విషయం తెలిసిందే. అప్పటికి 16వ లోక్ సభ పదవీ కాలం ఐదు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో అప్పటి మోదీ సర్కార్ తాత్కాలిక బడ్జెట్‌తో సరిపెట్టాల్సి వచ్చింది. ఆరోగ్యా కారణాలరీత్యా అప్పటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సభకు హాజరుకాలేకపోవడంతో తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పీయుష్ గోయల్ ఈ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇదిలావుంటే, నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం జూలైలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం.