Budget Expectations 2021: దేశ ఆర్ధిక వ్యవస్థ కరోనా మహమ్మారి కారణంగా అస్తవ్యస్థమైన నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ ఆసక్తి కల్గిస్తోంది. మరికాస్సేపట్లో నిర్మల..నెవర్ బిఫోర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నూతన ఆర్ధిక సంవత్సరపు ఆర్దిక బడ్జెట్ ( Union Budget 2021 ) మరి కాస్సేపట్లో రానుంది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Union finance minister nirmala sitaraman ) 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌ను నెవర్ బిఫోర్ బడ్జెట్ ( Never before budget ) ‌గా ఇప్పటికే అభివర్ణించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఆర్ధిక వ్యవస్థ కుదేలవడంతో ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలు ( Budget Expectations ) పెట్టుకున్నారంతా. 


ఇప్పటికే మంత్రులు నిర్మలా సీతారామన్ ( Nirmala Sitaraman ), అనురాగ్ ఠాగూర్ ( Anurag Thakur ) ‌లు ఆర్ధిక మంత్విత్వ శాఖ ( Finance ministry ) కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి కార్యాలయంలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ( President Ramnath kovind )‌ను కలిసి..పార్లమెంట్ ( Parliament )కు వెళ్లారు. కేబినెట్ ( Union Cabinet )భేటీలో ఆమోదం అనంతరం లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఈసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ చరిత్రలోనే తొలిసారిగా పేపర్ లెస్‌గా ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా ట్యాబ్‌లో బడ్జెట్‌ను భద్రపరిచారు. మరోవైపు కేంద్రమంత్రులు హర్షవర్ధన్, అమిత్ షా ( Amit shah ) కూడా పార్లమెంట్‌కు హాజరయ్యారు.  


ఈసారి బడ్జెట్ నెవర్ బిఫోర్‌గా ఉండనుందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపధ్యంలో ఏం ఉండబోతుందనే అనే ఆసక్తి కలుగుతోంది. సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు.. సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్‌లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలున్నారు. 2019లో తన తొలి బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా బడ్జెట్‌ను లెదర్‌ బ్యాగ్‌లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని నిర్మల  తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన బహీ ఖాతాలో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈసారి ట్యాబ్‌ ( Budget in Tab ) ను ఎర్రని వస్త్రంలో చుట్టి తీసుకొచ్చారు. 


Also read: Union Budget 2021 Live Updates: నేడు కీలక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న Nirmala Sitaram


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook