Good News: రైతులకు మోదీ 3.0 తొలి కానుక.. వరితోపాటు పంటలకు భారీగా ధరలు పెంపు
Union Cabinet Approves Minimum Support Prices To 14 Kharif Crops: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త వినిపించింది. పంటలకు సంబంధించి మద్దతు ధరలను భారీగా పెంచింది.
Kharif Crops MSP: మరోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వివిధ వ్యవసాయ పంటలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వరి, రాగి, జొన్న, మొక్కజొన్న, పత్తితోపాటు మొత్తం 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరలు పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం వెలువరించింది. అత్యధికంగా వరికి క్వింటాలుకు రూ.117 చొప్పున కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ ఖరీఫ్ కాలం నుంచి అమలు చేస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. కొత్త పేకమిషన్ ఏర్పాటుపై ప్రతిపాదన.. బేసిక్ పే ఎంతంటే..?
ఖరీఫ్ కాలంపై కేంద్ర మంత్రివర్గం బుధవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. దేశంలో వ్యవసాయ విధానంపై చర్చించింది. అనంతరం పంటల కనీస మద్దతు ధర విషయమై మంత్రివర్గంలో చర్చ జరిగింది. మంత్రివర్గంలో పంటల ధరలపై తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మద్దతు ధరల పెంపుతోపాటు పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుంది. వాటిలో రూ.2,870 కోట్లతో వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరించాలని నిర్ణయం. తమిళనాడు, గుజరాత్‌లో సముద్రపు నుంచి విద్యుదుత్పత్తి చేసేందుకు పవర్ ప్లాంట్లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టును ర.76,200 కోట్లతో చేపట్టాలని నిర్ణయం.
Also Read: General vs 2s Coach: రైలు జనరల్, 2S కోచ్ మధ్య తేడా ఏమిటి? మీరూ తెలుసుకోండి..
మద్దతు ధర పెంపుతో కనీస మద్దతు ధరలు ఇలా ఉన్నాయి
వరి రూ.2,300 (గ్రేడ్ ఏకు రూ.2,320)
కందిపప్పు రూ.7,550
మినుములు రూ.7,400
పెసర్లు రూ.8,682
వేరుసెనగ రూ.6,783
పత్తి రూ.7,121 (లాంగ్ స్టెపెల్ రకానికి రూ.7,521)
జొన్న రూ.3,371 (మాల్దండి రకానికి రూ.3,421)
నువ్వులు రూ.9,267
సోయాబీన్ రూ.4,892
సజ్జలు రూ.2,625
రాగులు రూ.4,290
పొద్దుతిరుగుడు రూ.7,280
రైతులకు నిరాశే..
కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ కాలానికి పెంచిన కనీస మద్దతు ధరలపై రైతుల నుంచి సానుకూల స్పందన రావడం లేదు. మద్దతు ధరలు పెంచాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్, ఢిల్లీలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వారి ఉద్యమాన్ని గ్రహించి కేంద్రం పంటల ధరలు భారీ స్థాయిలో పెంచుతుందని భావిస్తే నామమాత్రంగా పెంచడం రైతులను తీవ్ర నిరాశపర్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి