General vs 2s Coach: రైలు జనరల్, 2S కోచ్ మధ్య తేడా ఏమిటి? మీరూ తెలుసుకోండి..

General vs 2s Rail Coach Difference: సాధారణంగా మనం రైల్వే ప్రయాణం చేసినప్పుడు టిక్కెట్‌ ముందుగానే బుక్‌ చేసుకుంటాం. అది రిజర్వేషన్‌, ఇందులో ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ స్లీపర్ రకరకాలు అందుబాటులో ఉంటాయి. ఒక వేళ మనం వెంటనే జర్నీ చేయాలనుకుంటే తత్కాల్‌లో వెళ్లాల్సి ఉంటుంది.
 

1 /6

అయితే, మీరు ఎప్పుడైనా సాధారణంగా జనరల్‌ బోగీ ఉంటుంది అనుకుంటారు. కానీ, ఎప్పుడైనా మీరు 2s కోచ్‌ గమనించారా? ఇది కూడా జనరల్‌ బోగీ మాదిరి ఉంటుంది. కానీ, జనరల్‌కు, 2s కు తేడా ఏంటి అని గమనించారా? అయితే, ఇప్పుడు తెలుసుకోండి.  

2 /6

సాధారణంగా మనం ఈ రెండు కంపార్ట్‌మెంట్లలో ఎక్కువ రద్దీని గమనించవచ్చు. ఒక్కోసారి జనరల్‌, 2s ఒక్కటే అనుకుంటారు. కానీ, ఈ రెండూ వేర్వేరు. ఇందులో మీకు ఏసీ ఉండదు కేవలం కూర్చొని మాత్రమే వెళ్లాలి. చూడటానికి ఈ రెండు బోగీలు ఒకేవిధంగా ఉంటాయి. కానీ, ఇవి వేర్వేరు.  

3 /6

మనం ఒక వేళ స్లీపర్‌ కోచ్‌ బుక్‌ చేసుకున్నామంటే s1, s2, s3 అనే నంబర్ల కోచ్‌లలో మన టిక్కెట్‌ నంబర్‌ ఉంటుంది. అందులోనే సీటు కన్ఫామ్‌ అయి ఉంటుంది. అలాగే జనరల్‌, 2s బోగీలు కూడా రైలు ముందు భాగం, చివరి భాగంలో రెండేసి బోగీలు ఉంటాయి.   

4 /6

జనరల్‌ అంటే ఎవ్వరు ముందుగా రైలు సీటులో వచ్చి కూర్చుంటారో వాళ్లదే సీటు. దీనికి కేవలం టిక్కెట్‌ ముక్‌ చేసుకుని ఎక్కడ సీటు ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవాలి. దీనికి సీటు నంబర్‌ వంటివి ఉండదు. ముందు వచ్చిన వారికే ముందు ప్రాధాన్యత మిగతావారు ఎంత దూరం అయినా నిలబడి ప్రయాణం చేయాల్సిందే.  

5 /6

అయితే, 2s విషయానికి వస్తే ఇందులో రైలు ప్రయాణం చేయడానికి ముందుగానే సీటు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సీటులో ఆ వ్యక్తి మాత్రమే కూర్చొని ప్రయాణం చేయాలి. దీనికి మీకు సీటు నంబర్‌ కూడా ఇస్తారు. కానీ, ఇందులో పడుకుని ప్రయాణం చేయలేరు.  

6 /6

ఈ టిక్కెట్‌ ను ఐఆర్‌సీటీసీ లేదా ఇతర ట్రైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ యాప్‌ లేదా నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్‌లో మీకు టికెట్ వస్తుంది, కానీ దానిపై సీటు నంబర్ ఉండదు. ఇందులో ఎవరికీ సీట్ నంబర్ అందుబాటులో లేదు. 2s లో సీటు నంబర్ ఉండి బుక్‌ చేసుకున్న వ్యక్తికే ఆ సీటు దక్కుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x