Rajnath Singh: మధ్యప్రదేశ్ ఎన్నికలకు సమరం మోగింది. అప్పుడే కాంగ్రెస్, బీజేపీల మద్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రియాంకా గాంధీని ఏకంగా సీజనల్ హిందూవుగా పిలవడంపై దుమారం రేగుతోంది. కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో వాతావరణం వేడెక్కింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల పర్యటనలతో , వాడి వేడి విమర్శలతో ఎన్నికల సందడి ప్రారంభమైనట్టు కన్పిస్తోంది. ఇరు పార్టీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనమౌతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ నర్మదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అంశాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రచారాస్త్రంగా మల్చుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


కాంగ్రెస్ పార్టీలో కొందరు సీజనల్ హిందూవులుగా మారారని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతి కార్యక్రమం ముందు నర్మదా నదికి పూజలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు హనుమంతుడి గద్దతో బహిరంగ సభ నిర్వహిస్తున్న కాంగ్రెస్ పెద్దలు గతంలో రాముడు, హనుమాన్ పేర్లు కూడా పలికేవారు కారని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హనుమంతుడి గద్దతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ భారీ మెజార్టీతో మధ్యప్రదేశ్‌లో అధికారం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 


ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నామని, 2024 జనవరి 22వ తేదీన రామలల్లాను ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అప్పటి కమల్ నాథ్ ప్రభుత్వం నెరవేర్చకుండా ఇప్పుడు కొత్తగా మళ్లీ హామీలు ఇస్తోందని మండి పడ్డారు. కాగా ప్రియాంకా గాంధీని సీజనల్ గాంధీగా అభివర్ణిచడంపై దుమారం రేగుతోంది. కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున మంత్రి రాజ్‌నాథ్ సింహ్‌పై మండిపడుతున్నారు. 


Also read: NEET 2023 Results: నీట్ 2023 ఫలితాల వెల్లడి, ఏపీ, తమిళనాడు విద్యార్ధులకే మొదటి ర్యాంకు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook