Black Money: నల్లధనం అంశం మరోసారి తెరపైకొచ్చింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వెలుగులోకొచ్చిన ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టత ఇచ్చింది. బ్లాక్‌మనీపై నమోదైన ఫిర్యాదులు, అరెస్టుల వ్యవహారంపై వివరణ ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament monsoon session) బ్లాక్‌మనీ ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ విన్సెంట్ హెచ్ పాలా బ్లాక్‌మనీ అంశంపై పార్లమెంట్‌లో పలు ప్రశ్నలు సంధించారు. గత పదేళ్లకాలంలో స్విస్ బ్యాంకులో(Swiss Bank) ఎంతమేరకు నల్లధనం చేరిందని అడిగారు. విదేశాల్నించి స్వదేశానికి నల్లధనాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి చెప్పాలని, ఈ వ్యవహారంలో ఎంతమందిని అరెస్టు చేశారనేది చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ లేవనెత్తిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. గత పదేళ్లలో ఇండియా నుంచి స్విస్ బ్యాంకుల్లో జమ అయిన బ్లాక్‌మనీకు సంబంధించి అధికారిక అంచనాల్లేవని చెప్పారు. విదేశాల్లో నిల్వ చేసిన నల్లధనాన్ని(Black money) తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇటీవలికాలంలో అనేక చర్యలు తీసుకుందన్నారు. 


ది బ్లాక్‌మనీ ఇంపోజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్ 2015 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం (Central government) 2017 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం విదేశాల్లో బ్లాక్‌మనీ జమచేసినవారిపై కేసుల వ్యవహారంలో సమర్ధవంతంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. బ్లాక్‌మనీపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారని..ఈ కమిటీకు చైర్మన్, వైస్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు వ్యవహరించనున్నారు. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలతో ఇండియా కలిసి పనిచేస్తుందని వివరించారు. బ్లాక్‌మనీ యాక్ట్ ఇప్పటి వరకూ 107 ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌మనీ యాక్ట్ ప్రకారం 2021 మే వరకూ నమోదైన 166 కేసుల్లో అసెస్‌మెంట్ ఆర్డర్లు జారీ అయ్యాయి. 


Also read: Anti Dowry Policy: కేరళలో వరకట్నానికి వ్యతిరేకంగా వినూత్న నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook