Income Tax Department: ఈ ఫైలింగ్ సమస్యలపై ఇన్ఫోసిస్‌పై కేంద్ర ఆర్ధికశాఖ ఆగ్రహం
Income Tax Department: కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన వ్యవహారంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విమర్శలు ఎదుర్కొంటోంది. సాక్షాత్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..ఆ సంస్థ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..
Income Tax Department: కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన వ్యవహారంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విమర్శలు ఎదుర్కొంటోంది. సాక్షాత్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..ఆ సంస్థ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..
ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్(Incometax Department) మెరుగైన సేవల పేరుతో కొత్త ఐటీ పోర్టల్‌ను జూన్ 7 నుంచి ప్రారంభించింది. ఆదాయపు పన్నుశాఖ ఐటీ సాఫ్ట్‌వేర్ గతంలో టీసీఎస్ నిర్వహించేది. తాజాగా ఇన్ఫోసిస్‌తో ఒప్పందమైంది. ఆ తరువాతే కొత్త ఐటీ పోర్టల్ ప్రారంభమైంది. అప్పట్నించి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు వస్తూనే ఉన్నాయి. రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, టీడీఎస్ క్లెయిమ్ కోసమైనా గంటల తరబడి సమస్య ఎదురవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో పోర్టల్ సమస్యలపై పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులు, ఇతర భాగస్వాములు ఫిర్యాదులు చేశారు. పోర్టల్ ప్రారంభించి రెండున్నర నెలలైనా సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ విషయమై ఇన్ఫోసిస్(Infosys)సీఈవో సలీల్ పరేఖ్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలిపించి మందలించినట్టు సమాచారం. సమస్య ఇంకా ఎందుకు పరిష్కారం కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు సమన్లు కూడా జారీ చేసింది కేంద్ర ఆర్ధికశాఖ. కొత్త సైట్‌లో సమస్యలు 2-3 వారాల్లో పూర్తిగా పరిష్కారం కానున్నాయని మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) తెలిపారు. ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. పోర్టల్ అభివృద్ధికై ఇన్ఫోసిస్‌కు కేంద్రం 164 కోట్లు చెల్లించింది.
Also read: Interest Free Credit Card: వడ్డీ లేకుండానే క్రెడిట్ కార్డు, ఎలాగో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook