Interest Free Credit Card: వడ్డీ లేకుండానే క్రెడిట్ కార్డు, ఎలాగో తెలుసా

Interest Free Credit Card: మార్కెట్‌లో ఇప్పుడు కొత్తరకం క్రెడిట్ కార్డు వచ్చింది. ఈ కార్డుకు ఉన్న ప్రధాన ఆకర్షణ వడ్డీ లేకపోవడం. ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ కార్డు వివరాలిలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 23, 2021, 10:18 AM IST
Interest Free Credit Card: వడ్డీ లేకుండానే క్రెడిట్ కార్డు, ఎలాగో తెలుసా

Interest Free Credit Card: మార్కెట్‌లో ఇప్పుడు కొత్తరకం క్రెడిట్ కార్డు వచ్చింది. ఈ కార్డుకు ఉన్న ప్రధాన ఆకర్షణ వడ్డీ లేకపోవడం. ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ కార్డు వివరాలిలా ఉన్నాయి.

ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థ ఫిన్‌టెక్(Fintech) స్టార్టప్ కంపెనీ యూని సరికొత్త సేవల్ని ప్రారంభించింది. కొత్తగా మార్కెట్‌లో  పే 1/3 పే లేటర్ కార్డు ప్రవేశపెట్టింది. ఈ కార్డుకు ఉన్న ప్రత్యేకత వడ్డీ లేకపోవడం. అంటే వడ్డీ లేకుండా రుణ సదుపాయం. ఎలాగంటే ఈ కార్డు ద్వారా ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఆ నగదు మొత్తాన్ని మూడు భాగాల్లో విభజించి..మూడు నెలల వ్యవధి కల్పిస్తుంది. ఈ మూడు నెలల్లో వినియోగదారుడు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా మూడు వాయిదాల్లో చెల్లించే సదుపాయం ఉంటుంది. స్వల్పకాలిక రుణాల కోసం ఎదురుచూసే వినియోగాదారులకు ఈ కార్డు చాలా మంచి అవకాశంగా కన్పిస్తోంది. అదే తీసుకున్న 30 రోజుల్లో మొత్తం డబ్బు చెల్లించేస్తే క్యాష్‌బ్యాక్(Cashback)రూపంలో వినియోగదారుడిని 1 శాతం రివార్డు అందుతుంది. 

పే 1/3  పే లేటర్ కార్డును 2021 జూన్ నెలలో ఫిన్‌టెక్ సంస్థ పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. మార్కెట్‌లో వచ్చిన 2 నెలల్లోనే 10 వేలమంది కస్టమర్లు ఈ కార్డు తీసుకున్నారు. వచ్చే యేడాదికి 1 మిలియన్ వినియోగాదారుల్ని చేరుకోవాలనేది కంపెనీ లక్ష్యంగా ఉంది. ఈ కార్డులో ఎటువంటి రహస్య ఛార్జీలు లేకుండా పారదర్శకంగా అందించాలనుకుంటున్నామని, వినియోగదారుడి అనుభవాన్ని మరింతగా మెరుగుపర్చడంపై ఎక్కువ దృష్టి పెట్టామంటోంది కంపెనీ. ఇప్పటి వరకూ ఈ కార్డుపై ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఛార్జిలు లేవు. పే 1/3 పే లేటర్ కార్డులో రియల్ టైమ్ ఖర్చుల్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. కేటగరీల వారీగా చేసిన ఖర్చుల్ని తెలుసుకోవచ్చు. చెల్లించే సమయానికి వినియోగదారుడికి అలర్ట్ వస్తుంది. వీసా కార్డు మద్దతుతో రావడం వల్ల వీసా కార్డుకు అనుమతి ఉన్న ప్రతిచోటా ఈ కార్డు ఉపయోగించవచ్చు. అదే విధంగా వినియోగదారుడికి 6, 9, 12, 18 ఆ పై నెలల ఈఎమ్ఐ ప్లాన్(EMI Plans) ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. 

Also read: EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త, మార్చ్ 2022 వరకూ అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News