IT Returns Exemption: ఐటీ రిటర్న్స్ దాఖలు నుంచి ఇకపై మినహాయింపు, కేంద్ర ఆర్ధికశాఖ ఆదేశాలు
IT Returns Exemption: ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమందికి ఆదాయపు పన్నుల చెల్లింపుకు సంబంధించి మినహాయింపు ఇస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది.
IT Returns Exemption: ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమందికి ఆదాయపు పన్నుల చెల్లింపుకు సంబంధించి మినహాయింపు ఇస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది.
ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్‌కు(Incometax Returns) సంబంంధించి కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక నుంచి 75 ఏళ్ల వయస్సు పైబడిన వయో వృద్ధులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా మినహాయింపు ఇచ్చింది. 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి కొత్త మినహాయింపులు వర్తిస్తాయని తెలిపింది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ నుంచి మినహాయింపు పొందేందుకు అర్హులైనవారు ఏ పత్రాల్ని సమర్పించాలనే విషయంపై కేంద్ర ఆదాయపు పన్నుశాఖ ( Incometax Department)నోటిఫై జారీ చేసింది.
ఇక నుంచి అంటే 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరంలో 75 ఏళ్లు పైబడినవారు రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. పింఛను ఆదాయం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని ఒకే బ్యాంకు నుంచే పొందేవారిని అర్హులుగా తెలిపింది. 2020 ఫిబ్రవరిలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే ఈ విషయాల్ని వెల్లడించినా..ఈ సంవత్సరం నుంచి అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి తాజా నిబంధనలతో డిక్లరేషన్ ఫామ్‌లను నోటిఫై చేసింది. సంబంధిత బ్యాంకుల్లో పత్రాల్ని సమర్పిస్తే టీడీఎస్‌ను సంబంధిత బ్యాంకులు నిలిపివేయనున్నాయి. పింఛను డిపాజిటన్ అయ్యే బ్యాంకులోనే వడ్డీ ఆదాయం ఉంటేనే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు లభించనుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Also read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు, ఒక్కరోజులోనే 3 వందలకు పైగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook