Union Govt: రైతన్నలకు గుడ్న్యూస్..రుణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Union Govt: రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. రైతుల రుణాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
Union Govt: ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈక్రమంలో రైతులకు సంబంధించిన రుణాలపై వడ్డీని తగ్గించింది. రూ.3 లక్షల వరకు రుణాలపై వడ్డీని తగ్గించారు. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వడ్డీని తగ్గించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీని ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈనిర్ణయంతో వ్యవసాయ రంగంలో రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు.
2022-23 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాలకు ఈపథకం వర్తించనుంది. దీని వల్ల కేంద్రంపై రూ.34 వేల 856 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్, రీజినల్ రూరల్ బ్యాంకులు, కో-ఆపరేటివ్, ప్రాథమిక పరపతి సంఘాలకు రుణ వడ్డీ రాయితీ వర్తించనుందని చెప్పారు. రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణాలకు ఎప్పటిలాగే 4 శాతం వడ్డీ వర్తించనుంది.
కోవిడ్ కారణంగా దెబ్బతిన్న రంగాలపై కేంద్రప్రభుత్వం దృష్టి పెట్టింది. హాస్పిటల్స్, అనుబంధ రంగాల్లో సేవలందిస్తున్న రంగాలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీమ్ ప్రకటించారు. ఈపథకం కింద అందిస్తున్న రూ.4.5 లక్షల కోట్లకు మరో రూ.50 వేల కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు అత్యవసర రుణ పథకం కింద రూ.3.67 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
Also read:AP Floods: ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, కృష్ణమ్మ..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్..!
Also read:IND vs ZIM: రేపటి నుంచే భారత్, జింబాబ్వే మధ్య వన్డే సిరీస్..టీమిండియా ఓపెనర్ అతడే..!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook