IND vs ZIM: రేపటి నుంచే భారత్, జింబాబ్వే మధ్య వన్డే సిరీస్..టీమిండియా ఓపెనర్ అతడే..!

IND vs ZIM: టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. రేపటి నుంచి జింబాబ్వే గడ్డపై మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్ల బలాబలాలు ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Aug 17, 2022, 04:18 PM IST
  • మరో సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా
  • రేపటి నుంచే భారత్, జింబాబ్వే మధ్య వన్డే సిరీస్
  • హరారే వేదికగా తొలి మ్యాచ్
IND vs ZIM: రేపటి నుంచే భారత్, జింబాబ్వే మధ్య వన్డే సిరీస్..టీమిండియా ఓపెనర్ అతడే..!

IND vs ZIM: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత పురుషుల జట్టు జోరు మీద ఉంది. వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. ఇంగ్లండ్ టూర్ నుంచి టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లీష్ గడ్డపై టెస్ట్ సిరీస్ సమం కాగా..వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌లో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగా..ఐదు టీ20ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.

రేపటి నుంచి మరో పరిమిత మ్యాచ్‌ల సిరీస్‌ తెరలేవనుంది. హరారే వేదికగా భారత్, జింబాబ్వే మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.45 గంటలకు తొలి మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. భారత జట్టుకు కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ పనిచేయనున్నాడు. మొదట అతడే టీమిండియా సారధిగా ఎంపికయ్యాడు. ఐతే కేఎల్ రాహుల్ కోలుకుని..సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు.

దీంతో కేఎల్ రాహుల్‌నే కెప్టెన్‌గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. సిరీస్‌లో భారత యువ జట్టు రంగంలోకి దిగనుంది. మరో పది రోజుల్లో ఆసియా కప్ మొదలుకానున్నడంతో బీ జట్టును జింబాబ్వేకు పంపారు. తొలి మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌ గడ్డపై అలరించిన శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి ఓపెనర్‌గా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మిడిల్‌ ఆర్డర్ రానున్నాడు.

రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్‌పటేల్, శార్దుల్ ఠాకూర్, అవేష్‌ఖాన్‌లకు చోటు దక్కడం ఖాయం కనిపిస్తోంది. మొత్తంగా జైత్రయాత్రను కొనసాగించాలని భారత్ భావిస్తోంది. యువ ఆటగాళ్లతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో టీమిండియా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇటు జింబాబ్వే జట్టును తక్కువ అంచనా వేయలేం. ఎందుకుంటే ఇటీవల ఆ జట్టు ఆట తీరు మారిపోయింది. యువ ఆటగాళ్లతో జింబాబ్వే అదరగొడుతోంది. ఇటీవల బంగ్లాదేశ్‌ను ఆ జట్టు వణికించింది. 

భారత జట్టు (అంచనా)..

శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్, రాహుల్ త్రిపాఠి, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్‌పటేల్, శార్దుల్ ఠాకూర్, కూల్దీప్‌ యాదవ్/షాబాద్ అహ్మద్, అవేష్‌ఖాన్, సిరాజ్/ దీపక్ చాహర్

జింబాబ్వే (అంచనా)..

మరుమని, కైటనో, కియా, వెస్లీ మధెవెరె, సికిందర్ రజా, రెగిస్ చకబ్వా(కెప్టెన్), టోనీ మున్యోంగా, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యాచి, తనకా చివాంగా

Also read:AP Floods: ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, కృష్ణమ్మ..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్..!

Also read:Assam: రూ.500 కోసం రగడ..ఓ వ్యక్తి దారుణ హత్య..ఘటన ఎక్కడ జరిగిందంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News