Live video: 75 జిల్లాల్లో కరోనా ప్రభావం.. హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం
Live video: కరోనావైరస్ తాజా సమాచారంపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ మీట్
Live video: కరోనా వైరస్‌పై దేశ పౌరులకు తాజా సమాచారం వెల్లడించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం గాలిలో వైరస్ ప్రభావం లేదని.. కాకపోతే మనిషి తుమ్మడం లేదా దగ్గడం ద్వారా విడుదలైన తుంపర్లలో వైరస్ ప్రభావం ఉంటుందని తెలిపారు. ఏదైనా జబ్బు చేస్తే ఆ జబ్బు ఏంటనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని.. 80 శాతం మందికి జలుబు-జ్వరం లాంటి లక్షణాలు ఉన్నప్పటికీ.. అవి మామూలుగానే నయమవుతాయని బలరాం భార్గవ అన్నారు. మరో 20 శాతం మందికి దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉంటాయని.. వాళ్లలో కొంతమందికి మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతుందని తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన 5 శాతం మంది రోగులకు తగిన చికిత్స అందిస్తున్నామని.. అవసరమైతే కొన్ని కొత్త మెడిసిన్ కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 15000-17000 రక్త నమూనాలను టెస్ట్ చేశామని.. రోజుకు 10,000 మందికి రక్త పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని భార్గవ అన్నారు. ఆ లెక్క ప్రకారం వారానికి 50,000-70,000 మందికి రక్త పరీక్షలు చేయోచ్చని బలరాం భార్గవ వివరించారు.
Read also : Coronavirus: ఒక్క రోజే ఇద్దరిని బలి తీసుకున్న కరోనావైరస్
ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ.. దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న 75 జిల్లాలను గుర్తించామని.. ఆయా జిల్లాల్లో అత్యవసర సేవలు మినహాయించి అన్ని విభాగాలను మూసేయాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసినట్టు లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 341 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయని... అవి ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉందని లవ్ అగర్వాల్ స్పష్టంచేశారు.