Supreme court collegium: సుప్రీంకోర్టు కొలీజియం రాజ్యాంగానికి చెందింది కాదు, కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
Supreme court collegium: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ మరోసారి వివాదాస్పదమౌతోంది. న్యాయమూర్తుల బదిలీతో కొలీజియం వ్యవస్థపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తగా..ఇప్పుడు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ఇటీవలి కాలంలో తరచూ విమర్శలు పాలవుతూనే ఉంది. తాజాగా న్యాయమూర్తుల బదిలీతో చెలరేగిన విమర్శలతో మరోసారి కొలీజియంపై వివాదం రేగింది. ఇప్పుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ నౌ సమావేశంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు కొలీజియంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి సంబంధించింది కాదని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను సుప్రీంకోర్టు తన విజ్ఞత, కోర్టు తీర్పుతో ఏర్పాటు చేసిందన్నారు. 1991కు ముందు ప్రభుత్వమే న్యాయమూర్తుల్ని నియమించేదన్నారు.
కొన్ని న్యాయస్థానాలు లేదా కొందరు న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమైనప్పుడు...దేశం మద్దతు ఎలా ఇస్తుందని ఆశిస్తున్నారంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు కొలీజియం సిఫార్సుల్ని పంపించిన అనంతరం..ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందన్నారు.
కొలీజియం వ్యవస్థపై వస్తున్న ఆరోపణల నేపధ్యంలో గతంలో ఓసారి నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమీషన్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే..సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. ఈ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయని..పారదర్శకత లేనందున..ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రతి న్యాయమూర్తి సరైనవారు కాకపోయినా...ప్రతి తీర్పు సరైందన్నారు. కొలీజియం నిర్ణయాలపై ఇటీవలికాలంలో వ్యతిరేకత వ్యక్తమౌతున్న నేపధ్యంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also read: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి మనీశ్ సిసోడియాకు రిలీఫ్, ఛార్జిషీటులో లేని మనీశ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook