కేంద్ర మంత్రి డా. హర్ష్‌వర్ధన్ తనలోని కళాకారుడిని వెలికి తీశారు. జ‌న‌క మ‌హారాజు పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. ఢిల్లీలోని దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం జరిగిన లవ్ కుశ్ రామ్‌లీలా నాటకంలో సీత తండ్రి జనకుడి పాత్రలో నటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్ష్‌వర్ధన్ వేదికపై నుంచి పర్యావరణం-పరిశుభ్రత ప్రాముఖ్యత యొక్క సందేశాన్ని తెలియజేశారు. సీతా స్వయంవరానికి ఆహ్వానం పలుకుతూ జనకుడి పాత్రలో కేంద్రమంత్రి చేసిన డైలాగ్స్‌కు అందరినీ ఆకట్టుకున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాటకానికి బయల్దేరి వెళ్లేముందు.. కేంద్ర మంత్రి తాను నాటకంలో సీత తండ్రి, మిథిలా రాజ్యానికి మహారాజు అయిన జనకుడి పాత్రలో నటిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రెడ్‌ఫోర్ట్, చాందినీ చౌక్‌లో తన చిన్నతనంలో రామ్‌లీలా నాటకాన్ని చూసేవాడినని పేర్కొన్నారు.