COVID-19: మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus positive ) అనే వార్త నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చేర్పించారు.
న్యూ ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus positive ) అనే వార్త నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చేర్పించారు. కరోనావైరస్‌కి పేద, ధనిక అనే భేదం ఉండదు అని మనం గతంలోనే చెప్పుకున్నట్టుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇలా చెప్పుకుంటూపోతే కరోనావైరస్ బారిన పడిన ప్రముఖుల జాబితా ( VIPs infected with Coronavirus ) కూడా చాలా పెద్దదే తయారవుతుంది. పశ్చిమ బెంగాల్‌కి చెందిన మరో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సైతం కరోనావైరస్ సోకడంతో ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. Also read: నిజం చెప్పండి.. : ఆటగాళ్లకు BCCI warning
తనకు కరోనావైరస్ సోకడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ( Union minister Dharmendra Pradhan ) అన్నారు. ఆగస్టు 3న తనకు కరోనా లక్షణాలు ( Coronavirus symptoms ) కనిపించాయని.. వెంటనే మరునాడు మంగళవారం కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలిందని తెలిపారు. ఐతే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. గతవారమే కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ( Amit Shah ) కలిశారు. Also read: SSR death case: మహా సర్కార్‌కి బీహార్ సర్కార్ నుంచి మరో షాక్