Budget 2022 Live Updates: రానున్న మూడేళ్లలో 4 వందల వందేభారత్ రైళ్లు
Budget 2022 Live Updates: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడే బడ్జెట్ అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Budget 2022 Live Updates: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడే బడ్జెట్ అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా రెండవసారి కాగితం రహిత బడ్టెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈసారి యాప్‌లో కూడా ప్రజలకు అందుబాటులో డిజిటల్ బడ్జెట్ ఉంటుందని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
ఈ బడ్జెట్ ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, ఎస్సీ,ఎస్టీలకు ఉపయోగపడేదిగా ఉంటుందని నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తెలిపారు. ప్రధానమంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్ ఇందుకు దోహదపడుతుందన్నారు. రానున్న 25 ఏళ్లు దేశ ఆర్ధిక వ్యవస్థకు అమృతకాలంగా ఉండేలా ఈ బడ్డెట్ ఒక ఫౌండేషన్ లేదా బ్లూ ప్రింట్ లాంటిదన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం నుంచి వందేళ్ల స్వతంత్ర భారతదేశానికి తీసుకెళ్తుందన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పధకం ఆత్మ నిర్భర్ భారత్ సాధించేందుకు ఉపయోగపడిందన్నారు. ఫలితంగా 60 లక్షల కొత్త ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల ఉత్పాదన రానున్న ఐదేళ్లలో సాధ్యమవుతుందన్నారు.
ఈసారి బడ్జెట్‌లో (Budget 2022) గతి శక్తి, ప్రత్యేక అభివృద్ధి, ఉత్పాదన, పెట్టుబడులు పెంచడం, కొత్త అవకాశాలు, ఎనర్జీ ట్రాన్సిషన్ వంటివి తొలి ప్రాధాన్యతలని నిర్మలా సీతారామన్ చెప్పారు. రానున్న మూడేళ్లలో 4 వందల న్యూ జనరేషన్ వందేభారత్ రైళ్లను (Vande Bharat Trains) ప్రవేశపెడుతున్నామన్నారు. అదే సమయంలో రానున్న మూడేళ్లలో పీఎం గతి శక్తి టెర్మినల్స్ వంద వరకూ అభివృద్ది చేయనున్నామన్నారు.
Also read: Gas Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త, భారీగా తగ్గిన సిలెండర్ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook