Nitin Gadkari on Vaccine: వ్యాక్సినేషన్‌పై నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు
Nitin Gadkari on Vaccine: దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అంతరాయం. వ్యాక్సిన్ కోసం ప్రజానీకం ఎదురుచూపులు. ఈ క్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాక్సినేషన్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారు.
Nitin Gadkari on Vaccine: దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అంతరాయం. వ్యాక్సిన్ కోసం ప్రజానీకం ఎదురుచూపులు. ఈ క్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాక్సినేషన్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారు..
కరోనా మహమ్మారి (Corona Pandemic) నియంత్రణకు వ్యాక్సినేషన్(Vaccination) ఒక్కటే మార్గం. దేశంలో రెండు కంపెనీలే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుండటంతో తీవ్రమైన వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. అందుకే చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోయింది. వ్యాక్సిన్ కొరత కారణంగా ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ, ఢిల్లీ ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ పేటెంట్ డీ లైసెన్సింగ్(Vaccine Patent Delicensing) గురించి సూచనలు జారీ చేశారు. ఇతర కంపెనీలకు వ్యాక్సిన్ తయారీ బాధ్యతలు అప్పగించాలని..అప్పుడే పెద్దఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వానికి సూచించాయి.
ఈ నేపధ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Union minister Nitin Gadkari) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎక్కువ కంపెనీలకు వ్యాక్సిన్ తయారీ లైసెన్స్ ఇవ్వాలని..అదే విధంగా రాయల్టీ చెల్లించాలని నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రతి రాష్ట్రంలో రెండు మూడు ల్యాబ్‌లను ఉపయోగించుకుంటే 15-20 రోజుల్లోనే వ్యాక్సిన్ సరఫరా జరుగుతుందని..సమస్య త్వరగా పరిష్కారమవుతుందని నితిన్ గడ్కరీ సూచించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్( Jairam Ramesh) చురకలు అంటించారు. ఇదే విషయాన్ని ఏప్రిల్ 18 వతేదీన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని మోదీకు రాసిన లేఖలో ప్రస్తావించినప్పుడు మీరేం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకీ మీ వ్యాఖ్యల్ని మీ బాస్ వింటున్నారా అని వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. వాస్తవానికి ఇదే అంశంపై ఏపీ, ఢిల్లీ ముఖ్యమంత్రులు సూచనలు చేసిన మూడ్రోజులకే కేంద్రం ఇదే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం వెలువడింది.
Also read: Deadline for Whatsapp: ప్రైవసీ పాలసీపై వాట్సప్‌కు కేంద్రం హెచ్చరిక, ఏడు రోజుల డెడ్‌లైన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook