Rajasthan Unique Baby: రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది, రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో ఓ వింత శిశువు జన్మించింది. అయితే ఈ నవజాత శిశువు పుట్టిన 20 నిమిషాలకే మరణించింది.  అయితే బిడ్డ తల్లి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లోని గంగారాం ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ వింత పాపను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చాలా మంది జనం తరలివచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే...
రతన్‌గఢ్‌లో రాజల్‌దేసర్‌లోని 3వ వార్డులో నివాసం ఉంటున్న 19 ఏళ్ల గర్భిణి హజారీ సింగ్‌ కు పురిటినొప్పులు రావడంతో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించిన వైద్యులు అందులో వింత శిశువు కనిపించినట్లు డాక్టర్ కైలాష్ సొంగరా తెలిపారు. ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత హజారీ సింగ్‌ కు నార్మల్ డెలివరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ రకమైన డెలివరీని కంజుక్టివల్ అనోమలీ అంటారు. అయితే 20 నిమిషాలకే బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ బిడ్డ ఇలా పుట్టడానికి క్రోమోజోమ్‌ల లోపం కావచ్చ అని వారు తెలిపారు. 


2022 డిసెంబరులో ఇలాంటి వింత ఘటనే మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్ జిల్లాలో ఓ పాప నాలుగు కాళ్లతో పుట్టింది. అయితే ఈ బిడ్డ పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 


Also Read: Varanasi: కాశీలో ప్రసాదంగా 'మిల్లెట్‌ లడ్డూలు'.. 'శ్రీ అన్న ప్రసాదం'గా పేరు మార్పు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook