Viral Video: సీఎం యోగి వేషధారణలో పోలింగ్‌బూత్‌కు కోహ్లీ.. సెల్పీలు దిగిన ఫాన్స్! చివరకు ట్విస్ట్!!
Raju Kohli Dressed Like CM Yogi Adityanath: నోయిడాకు చెందిన రాజు కోహ్లీ అనే వ్యక్తి అందరిని ఆకట్టుకున్నాడు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేషధారణలో పోలింగ్‌బూత్‌కు రావడంతో అందరూ సెల్పీలు దిగారు.
Raju Kohli Dressed Like CM Yogi Adityanath: యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈరోజు (ఫిబ్రవరి 10) ప్రశాంతంగా సాగింది. సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపుగా 60 ఓటింగ్ శాతం నమోదైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రూల్స్ పాటిస్తూ చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. అయితే నోయిడాకు చెందిన రాజు కోహ్లీ అనే వ్యక్తి అందరిని ఆకట్టుకున్నాడు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేషధారణలో పోలింగ్‌బూత్‌కు రావడంతో అందరూ సెల్పీలు దిగారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తరహా వేషధారణ ధరించిన రాజు కోహ్లీ ఓటు వేసేందుకు నోయిడాలోని సెక్టార్ 11 పోలింగ్ బూత్ వద్దకు వచ్చాడు. కోహ్లీ రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా.. నిజంగా సీఎం అనుకున్న కొందరు ఆయన్ను ఫాలో అయ్యారు. పోలింగ్‌బూత్‌కు వచ్చిన కోహ్లీని చూసి ఓటర్లు షాక్ అయ్యారు. ఇక కోహ్లీని నేరుగా పోలింగ్ బూత్‌లోకి పోలీసులు అనుమతించారు. ఓ వైపు చాలా మంది ప్రజలు క్యూ లైన్లలో వేచి ఉండగా.. సీఎం యోగి వేషధారణలో ఉన్న అతడు మాత్రం దర్జాగా లోపలికి వెళ్లి ఓటు వేశాడు.
ఇక ఓటు వేసి తిరిగి వస్తున్న రాజు కోహ్లీ.. బట్టతల, కుంకుమ చోళతో యోగి ఆదిత్యనాథ్ అద్దంలా కనిపించడంతో అతడిపై అందరి చూపు మళ్లింది. కొందరు సీఎం యోగి అనుకుని సెల్ఫీలు కూడా దిగగా.. తీరా చుస్తే అతడు కోహ్లీ. మరికొందరు అసలు విషయం తెలిసినా ఫొటోలకు పోజులివ్వమని కోరారు. దీనికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ గురువారం ప్రారంభం కాగా.. చివరి దశ పోలింగ్ మార్చి 7న జరుగుతుంది. గురువారం షమ్లి, ముజఫర్‌నగర్, భాగ్పట్, మీరట్, ఘజియాబాద్, హపూర్, గౌతం బుద్ధనగర్, బులంద్‌షహర్, అలీఘఢ్, మధురా, ఆగ్రా జిల్లాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. ఈసారి యూపీలో ప్రధానంగా నాలుగు పార్టీలు పోటీ పడుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని అధికార బీజేపీ, అఖిలేష్-జయంత్ చౌదరి నేతృత్వంలోని ఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పాటు ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.
Also Read: Ratan Tata: రతన్ టాటాను 'ఛోటూ' అన్న అమ్మాయి.. వ్యాపార దిగ్గజం ఏం రిప్లై ఇచ్చారో తెలుసా?
Also Read: Samantha Sreeshanth: సమంతతో ఆడిపాడనున్న టీమిండియా క్రికెటర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook