victim funeral done at midnight without informing family: న్యూఢిల్లీ: మృగాళ్ల వేటకు మరో నిండు ప్రాణం బలైంది. 19 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి (Gang rape).. నాలుక కోసి, చిత్రహింసలు చేసిన సంఘటన యూపీ (Uttar Pradesh) లోని హత్రాస్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఆయువతిపై రెండు వారాల క్రితం ఈ దారుణ సంఘటన జరుగగా.. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచింది. అయినా ఆ బాధితురాలిని.. కుటుంబసభ్యులకు చూపించకుండా.. అనుమతించకుండానే పోలీసులు అంతిమసంస్కారాలు నిర్వహించిన తమ మార్కును చూపించారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున 2.30గంట సమయంలో బలవంతంగా దహనం చేశారు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మృతదేహాన్ని అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు సమాచారం ఇవ్వకుండానే.. గ్రామంలో భారీగా పోలీసు బృందాన్ని మోహరించి తమ కూతురి అంత్యక్రియలు నిర్వహించడం పట్ల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. Also read: Babri Masjid demolition case: నేడే బాబ్రీ తీర్పు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబరు 14న ఢిల్లీకి 200 కిమీ.. దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో 19ఏళ్ల యువతిని ఉన్నత వర్గానికి చెందిన నలుగురు కిరాతకులు అత్యాచారానికి పాల్పడి, నాలుక కోసి, గొంతు నులిమి చిత్రహింసలు పెట్టడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను ముందుగా ఢిల్లీలోని ఎఎంయూలో చేర్చారు. ఆతర్వాత ఆమె పరిస్థితి క్షీణించడంతో సప్దర్ జంగ్ ఆసుపత్రిలో చేర్చగా.. ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. బాధితురాలి మృతితో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రికి చేరుకోని భీమ్ ఆర్మీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆసుపత్రి దగ్గర ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించకుండానే పోలీసులు హత్రాస్‌కు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశారు. అయితే తమకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించకుండా.. కడసారి చూపునకు కూడా అనుమతించకుండా బలవంతంగా అంతిమ సంస్కారాలు చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. Chandamama Artist Shankar Dies: చందమామ ఆర్టిస్ట్ శంకర్ కన్నుమూత


ఇదిలాఉంటే.. ఈ కేసులో నలుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పలు పార్టీలు సైతం ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు సైతం కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా తమ గళాన్ని వినిపిస్తున్నారు. 


 




 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe