కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారిని విపరీత వ్యాఖ్యలతో దూషించారు. అందరి ముందే పరుష పదజాలంతో చీవాట్లు పెట్టారు. ఆ అధికారి అవినీతికి పాల్పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి పైవిధంగా స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బహేరీలో పీడీఎస్ పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పబ్లిక్ మీటింగ్ లో ఈ విధంగా చీవాట్లు పెట్టడంతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి ఇలా తిట్టడం, అవమానించడంపై అధికారులు చర్చించుకుంటున్నారు.


కాగా, సమావేశంలో ప్రధానంగా ఆమె ప్రతి ఇంటికీ రోడ్లు, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు అవసరాలపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. సౌభాగ్య యోజన గురించి కూడా ఆమె ఈ సమావేశంలో మాట్లాడారు.