Yogi Adityanath: యోగి సర్కారు సంచలన నిర్ణయం.. లవ్ జిహాద్ లకు పాల్పడితే దబిడి దిబిడే.. అమల్లోకి కొత్త చట్టం..
Uttar Pradesh: యోగీ సర్కారు బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. దీంతో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై ఇక మీదట కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
UP government assembly passes strictly love jihad bill imprisonment: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన లవ్ జీహాద్ చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి.మాయా మాటలు చెప్పి పెళ్లి చేసుకొవడం, మతమార్పిడులకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. అవతలివాళ్లు అంగీకరించకుంటే.. దాడులు చేయడం, హత్యలు చేయడానికి సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో యోగీ సర్కారు లవ్ జీహాద్ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో.. సోమవారంనాడు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఈరోజు సభ ఆమోదించింది.
Read more: Snake: నాగ పంచమికి ముందు అరుదైన ఘటన.. నాగ దేవత విగ్రహం మీద నాగు పాము.. వీడియోవైరల్..
ఇక మీదట.. బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ (Uttar Pradesh Assembly) మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. సోమవారంనాడు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఈరోజు సభ ఆమోదించింది. సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు చేసుకొవడం, మతమార్పిడికి పాల్పడే వారికి శిక్షలను కఠినంగా అమలు చేస్తారు.
కొత్త చట్టం ప్రకారం.. లవ్ జీహాద్ లకు పాల్పడే వారికి.. గరిష్టంగా యావజ్జీవ జైలుశిక్ష పడుతుంది. సవరించిన నిబంధనల ప్రకారం మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, పెళ్లి చేసుకోవడం, వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం, తమ మతంలోకి మారాలని వేధించడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో 20 ఏళ్లు జైలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు.
గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడన వారికి పదేళ్ల జైలు, రూ.50,00 జరిమానా ఉండేది. అదే విధంగా గతంలో బాధితుల కుటుంబ సభ్యులు, లేదా బంధువులు మాత్రం ఫిర్యాదుకు అవకాశం ఉండేది. కానీ సవరించిన కొత్త చట్టం ప్రకారం ఎవరైనా ఘటన గురించి తెలిసి వారు ఫిర్యాదు నమోదు చేయవచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ, ఫిర్యాదు కానీ బాధితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది.
Read more: Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..
ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టరాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థనను సైతం పరిశీలించరాదు. ఇవన్నీ నాన్-బెయిలబుల్ కేసులుగా కూడా పరిగణిస్తారు. దీంతో ఈ కొట్ట చట్టంతో యోగీ సర్కారు.. లవ్ జీహదీలకు మాత్రం మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter