UPSC Results 2020: సివిల్స్-2020 తుది ఫలితాలు విడుదల..సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు
UPSC Results: సివిల్స్-2020 తుది ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఐఐటీ బాంబే నుంచి బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు సాధించాడు.
UPSC Results-2020: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2020 తుది ఫలితాలు(UPSC Civil service results 2020) విడుదలయ్యాయి. మొత్తం 761 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ(UPSC) వెల్లడించింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు.
263 మంది జనరల్, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 86 మంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్-2020 తుది ఫలితాల్లో శుభం కుమార్(Shubham Kumar) మొదటి ర్యాంకుతో మెరిశారు. జాగృతి అవస్థి రెండో ర్యాకు, అంకితా జైన్ మూడో ర్యాంకు సాధించారు. upsc.gov.in. వెబ్ సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
సత్తాచాటిన తెలుగు తేజాలు..
తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులూ తమ సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థులు పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్ 84వ ర్యాంకు, యశ్వంత్ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు, కె.సౌమిత్ రాజు 355వ ర్యాంకు, తిరుపతి రావు 441, ప్రశాంత్ సూరపాటి 498, ఇ వేగిని 686వ ర్యాంకు, డి. విజయ్ బాబు 682వ ర్యాంకు, కళ్లం శ్రీకాంత్‌రెడ్డి 747వ ర్యాంకు సాధించారు.
Also Read: CM Jagan: ఏపీ వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
శుభం కుమార్ కు తొలి ర్యాంకు
ఈ ఫలితాల్లో తొలి 25మంది జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా.. 12 మంది అమ్మాయిలు మెరిశారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్ ఐఐటీ బాంబే(IIT Bombay)లో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. రెండో ర్యాంకు సాధించిన జాగృతి అవస్థీ భోపాల్ నిట్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు.
ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ(UPSC) విడుదల చేసింది. 2015లో యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా నిలిచిన టీనా దాబి సోదరి రియా దాబి 15వ ర్యాంకు సాధించారు.
ఇలా చెక్ చేసుకోండి..
Step 1: యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in కు వెల్లండి.
Step 2: హోమ్ పేజీలో కనిపించే ‘results’ ఆప్షన్‌ని క్లిక్ చేయండి.
Step 3: పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.ప్రిలిమ్స్ ఫలితాల్లో అర్హత సాధించినవారి రూల్ నంబర్స్ మాత్రమే అందులో ఉంటాయి.
Step 4: ఫలితాలు క్రోనోలాజికల్ ఆర్డర్‌లో కనిపిస్తాయి. మీ రూల్ నంబర్ కోసం స్కాన్ చేయండి లేదా ఫైండ్ ఆప్షన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి