యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభం
నేడు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సివిల్స్ కోసం దేశ వ్యాప్తంగా 10.65 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్‌కు దేశ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాలలోనూ యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్‌కు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ నగరాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రిలిమినరీ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండుపూటలా నిర్వహించనున్నారు. పేపర్-1 ఉదయం 9.20 గంటల నుంచి 11.20 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.20 గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు జరగనుంది.