559 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్
మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (Combined Medical Services Examination 2020) నోటిఫికేషన్‌ను UPSC విడుదల చేసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (Combined Medical Services Examination 2020) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ (MBBS)తోపాటు ఇంటర్న్‌షిప్ కూడా పూర్తిచేసిన అభ్యర్థులను అర్హులుగా పరిగణిస్తారు. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి
అప్లై చేయడానికి క్లిక్ చేయండి (Online Application)
మొత్తం పోస్టులు: 559
- సెంట్రల్ హెల్త్ సర్వీస్ విభాగంలో జూనియర్ స్కేల్(సెంట్రల్ హెల్త్ సర్వీసెస్): 182 ఉద్యోగాలు
- రైల్వే డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్: 300 ఉద్యోగాలు
- ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (హెల్త్ సర్వీస్)లో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్: 66 ఉద్యోగాలు
- న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 04 ఉద్యోగాలు
- ఈస్ట్/నార్త్/సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో జూనియర్ డ్యూటీ మెడికల్ గ్రేడ్(2): 07 ఉద్యోగాలు COVID19 Medicine: రూ.59కే కరోనా ట్యాబ్లెట్..
వయోపరిమితి (Age Limit): 01.08.2020 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
అప్లై చేయడానికి క్లిక్ చేయండి (Online Application)
జులై 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.08.2020. రూ.200 చెల్లించి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, బెంగళూరు, చెన్నైతో సహా దేశవ్యాప్తంగా 41 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి (Click here for CMSE Notification)