Nursing Officer Posts: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు యూపీఎస్సీ ఓ శుభవార్త వినిపించింది. నర్సింగ్ చేసిన అభ్యర్ధుల కోసం ఓ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 1,930 నర్సింగ్ అధికారి ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మార్చి 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sudharmurthy: విద్యావేత్త సుధామూర్తికి మహిళా దినోత్సవ 'కానుక'.. రాజ్యసభకు నామినేట్‌


కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు..


మొత్తం నర్సింగ్ అధికారి పోస్టులు: 1,930


అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో పోస్టుల వివరాలు: 892
ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల వివరాలు: 193
ఓబీసీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 446
ఎస్సీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 235
ఎస్టీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 164
దివ్యాంగుల కేటగిరీలో పోస్టుల వివరాలు: 168

Also Read: River Metro: దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో మెట్రో రైలు.. నదిలో రైలు విశేషాలు ఇలా


అర్హతలు
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. లేదా జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీలో డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. కనీసం యాభై పడకల ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం కూడా ఉండాలి. 


అభ్యర్థుల వయో పరిమితి
అభ్యర్ధుల వయసు మార్చి 27, 2024 నాటికి జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీ 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ 35 ఏళ్లు, దివ్యాంగులకు 40 సంవత్సరాల వయసు మించకూడదు. 


దరఖాస్తు రుసుము
దరఖాస్తు రుసుము కింద రూ.25. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. 


ఉద్యోగ ప్రక్రియ ఎంపిక
మొదట రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్


ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 7 మార్చి 2024
దరఖాస్తుకు ఆఖరి గడువు: 27 మార్చి 2024
దరఖాస్తు సవరణ తేదీలు: 28 మార్చి  నుంచి ఏప్రిల్‌ 3 వరకు
రాత పరీక్ష తేదీ: 7 జులై 2024



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి