UPSC Results 2021: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు వీరే..!
UPSC Results 2021: సివిల్స్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. 685 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసింది.
UPSC Results 2021: సివిల్స్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. 685 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ తుది ఫలితాల్లో శృతిశర్మకు తొలి ర్యాంక్ దక్కింది. అంకిత అగర్వాల్‌కు రెండు, గామిని సింగ్లాకు మూడో ర్యాంక్‌లో నిలిచారు. 685 మంది విద్యార్థుల్లో జనరల్ కోటా 244 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 73, ఓబీసీ నుంచి 203, ఎస్సీ 105, ఎస్టీ నుంచి 60 మంది ఎంపికయ్యారు.
మొత్తంగా ఐఏఎస్‌కు 180 మంది, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది నియమితులైయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరికి 242 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మరో 90 మంది గ్రూప్ బీ సర్వీసులు దక్కాయి. ఈ విషయాన్ని యూపీఎస్సీ అధికారికంగా వెల్లడించింది. మరోవైపు సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల హవా కొనసాగింది. యశ్వంత్‌కుమార్ రెడ్డి 15వ ర్యాంకు సాధించారు.
పూసపాటి సాహిత్ 24వ ర్యాంకు, కొప్పిశెట్టి కిరణ్మయి 56వ ర్యాంక్, శ్రీపూజ 62వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంక్‌లో నిలిచారు. 117వ ర్యాంక్‌లో ఆకునూరి నరేష్, 136వ అరుగుల స్నేహ, 161వ ర్యాంక్ చైతన్యరెడ్డి, 297వ ర్యాంక్‌లో కమలేశ్వరరావు ఉన్నారు. 336వ ర్యాంక్ విద్యామరి శ్రీధర్, 350వ ర్యాంక్ అశోక్, 374వ ర్యాంక్‌ను శరత్ నాయక్ సాధించారు. 420వ ర్యాంక్‌లో బాలకృష్ణ, 470వ ర్యాంక్‌లో ఉప్పులూరి చైతన్య, 564 ర్యాంక్‌లో అనిరుధ్ నిలిచారు.
566వ ర్యాంక్ బిడ్డి అఖిల్, 574వ ర్యాంక్‌లో రంజిత్‌కుమార్, 602వ ర్యాంక్‌లో పాండు విల్సన్ ఉన్నారు. 623వ ర్యాంక్ అరవింద్, స్వరణ్‌రాజ్ 676వ ర్యాంక్ సాధించారు. అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగులను తీసుకునేందుకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది.
Also read:YSRCP MLC WARNING: అచ్చెన్నాయుడిని గుడ్డలూడదీసి కొడతా.. వైసీపీ ఎమ్మెల్సీ ఓపెన్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook