కమలా హారిస్ (Vice President of US Kamala Harris).. ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు ఇది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే అమెరికా (US Election Results 2020) ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి ఇండో అమెరికన్ మహిళగా కమలా హారిస్ సరికొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధంగా ఉన్నారు. కమలా హారిస్ విజయంపై భారత్‌లో నివాసం ఉంటున్న ఆమె బంధువులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ సోదరి డాక్టర్ సరళా గోపాలన్ చాలా సంతోషంగా ఉన్నారు. తన అక్క కూతురు కమలా హారిస్ అగ్రరాజ్యంలో ప్రధాన పీఠాన్ని అధిరోహించనుండటంపై హర్షం వ్యక్తం చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


జాతీయ మీడియా ఏఎన్ఐతో కమలా హారిస్ చిన్నమ్మ సరళా గోపాలన్ మాట్లాడారు. ‘నేను ఓ డాక్టర్‌. చండీగఢ్‌లో డాక్టర్‌గా సేవలందిస్తున్నాను. కమలా హారిస్ పలుమార్లు చండీగఢ్ సహా ఇతర ప్రాంతాలకు వచ్చి మమ్మల్ని కలిసేది. చిన్నప్పటి నుంచి కమలా హారిస్ శైలిని గమనిస్తున్నాను. ఎన్నో మంచి గుణాలను కమలా హారిస్ అలవరుచుకుంది. ఈరోజు ఆమె సాధించిన విజయం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. మా కుటుంబానికి ఇది చాలా గర్వంగా ఉంది. కమలా హారిస్ తాను కోరుకున్నది సాధించి చూపించారని’ సరళా గోపాలన్ అభిప్రాయపడ్డారు.



 


కమలా హారిస్ తల్లి, చెన్నై నేపథ్యమున్న శ్యామలా దేవి చెల్లెలు సరళా గోపాలన్. తన అక్క శ్యామలా దేవి క్యాన్సర్‌పై రీసెర్చే చేసేవారని, ఆమె సామాజిక కార్యకర్త కూడా అని తెలిపారు. తన నామినేషన్ అంగీకారం సమయంలో కమలా హారిస్ తన తల్లి తరఫు బంధువులను తమిళంలో సంబోధించడం తెలిసిందే. కమలా హారిస్ తమతో రెగ్యూలర్‌గా ఉండేదని, భారత్‌కు వచ్చి పలుమార్లు కలిసిందని  సరళా గోపాలన్ పేర్కొనడం గమనార్హం. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయం సాధించడం తెలిసిందే. అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్ నిలవనున్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe