US on New Farm Laws: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలిప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ సెలెబ్రిటీల మద్దతుతో చర్చనీయాంసమైంది. ఇప్పుడు జో బిడెన్ జత చేరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇండియా వరకే పరిమితమైన రైతు చట్టాల ( Farm laws ) విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ( Farmers Protest ) కొనసాగుతోంది. మరోవైపు గణతంత్రదినోత్సవాన జరిగిన ట్రాక్టర్ ర్యాలీ, హింసాత్మక ఘటనలు ఆందోళన రేపాయి. ఈ నేపధ్యంలోనే రైతు ఆందోళనకు మద్దతుగా ప్రముఖ సెలెబ్రిటీలు రిహన్నా, గ్రెటా థన్ బర్గ్, కమలా హ్యారిస్ ( Kamala Harris )మేనకోడలు మీనా హారిస్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు గొంతెత్తారు. ఇటు ఇండియాకు చెందిన కొందరు సెలెబ్రిటీలు దీనిపై అభ్యంరం వ్యక్తం చేశారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యమేంటని ప్రశ్నించారు. ఎవరు అభ్యంతరం తెలిపినా..మద్దతిచ్చినా రైతు చట్టాలు మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 


ఇప్పుడు కొత్తగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ( America president Joe Biden ) వచ్చి చేరారు. రైతు చట్టాలకు మద్దతిచ్చి చర్చనీయాంశమయ్యారు. భారతదేశం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్టాలు దేశీయ మార్కెట్ల సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తాయని జో బిడెన్ ( Joe Biden ) స్పష్టం చేశారు. ఈ చట్టాలకు తాము మద్దతిస్తున్నామని అన్నారు. అదే సమయంలో నిరసనలపై కూడా స్పందించారు. శాంతియుత నిరసనలనేవి అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య లక్షణంగా అమరికా గుర్తిస్తోందన్నారు. ఎక్కువ ప్రైవేటు రంగ పెట్టుబడుల్ని ఆకర్షించే చర్యల్ని స్వాగతిస్తున్నామన్నారు. 


Also read: Tweet war on farmers protest: విదేశీ సెలెబ్రిటీల ట్వీట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook