Tweet war on farmers protest: విదేశీ సెలెబ్రిటీల ట్వీట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్

Tweet war on farmers protest: దేశ ఐక్యతను ఎలాంటి దుష్ప్రచారం దెబ్బతీయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రైతు నిరసనలపై కొందరు విదేశీ సెలెబ్రిటీలు చేస్తున్న వ్యాఖ్యలపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

Last Updated : Feb 5, 2021, 12:27 PM IST
Tweet war on farmers protest: విదేశీ సెలెబ్రిటీల ట్వీట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్

Tweet war on farmers protest: దేశ ఐక్యతను ఎలాంటి దుష్ప్రచారం దెబ్బతీయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రైతు నిరసనలపై కొందరు విదేశీ సెలెబ్రిటీలు చేస్తున్న వ్యాఖ్యలపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

రైతు ఆందోళన ( Farmers Protest )కు మద్దతుగా హాలీవుడ్ సింగర్ రిహన్నా చేసిన ట్వీట్ ట్రెండ్ అయింది. రిహన్నా బాటలో మరి కొంతమంది విదేశీ సెలెబ్రిటీలు నడిచారు. రైతులకు మద్దతుగా ట్వీట్స్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ రకమైన అక్కౌంట్లను బ్లాక్ చేయాలని గతంలో కేంద్ర ఐటీ శాఖ కోరిన పరిస్థితి ఉంది. అయితే ModiPlanningFarmerGenocide అనే హ్యాష్‌ట్యాగ్‌కు మళ్లీ ట్విట్టర్ అనుమతిచ్చింది. దాంతో ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం. మారణహోమం అనేది భావస్వేచ్ఛ కాదని..శాంతిభద్రతలకు ముప్పు అని తెలిపింది. 

ఢిల్లీ సరిహద్దు ( Delho Borders )ల్లో కొనసాగుతునన్న రైతు నిరసనలపై కొందరు విదేశీ సెలెబ్రిటీలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Union Home Ministry Amit Shah ) పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దేశ ఐక్యతను ఇలాంటి వ్యాఖ్యలు దెబ్బతీయలేవని చెప్పారు. దేశం అత్యున్నత స్థాయికి చేరకుండా ఎటువంటి దుష్ప్రచారం అడ్డుకోలేదని అమిత్ షా ట్వీట్ ( Amit shah tweet ) చేశారు. దుష్ప్రచారమనేది భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించలేవని..అభివృద్ధిపైనే ఇండియా భవితవ్యముంటుందని అన్నారు. మరోవైపు ఇండియా ఎగైనెస్ట్ ప్రోపగాండా, ఇండియా టుగెదర్ అనే ట్వీట్‌కు హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. 

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం ట్విట్టర్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ట్విట్టర్‌కు హెచ్చరిక జారీ చేస్తూనే..దుష్ప్రచారానికి కౌంటర్ ప్రచారం మొదలుపెట్టాలని నిర్ణయించింది కేంద్రం

Also read: Mumbai local: ముంబైకర్ల జీవితంలో ఓ భాగం..అందుకే ట్రైన్‌కు మోకరిల్లి దండం పెట్టాడు ఆ యువకుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News