Google Pay యాప్ ప్రమోషన్.. గూగుల్‌పై విచారణకు ఆదేశాలు
Google pay Transactions | గూగుల్ కంపెనీ తన ప్లే స్టోర్ (Google Play Store) మరియు ఆండ్రాయిడ్ ఓఎస్‌లపై తన ప్రమేయం ద్వారా ఇతర పోటీ యాప్‌లకు బదులుగా నగదు చెల్లింపులకు గూగుల్ పే వైపు మొగ్గు చూపుతోందని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
టెక్ దిగ్గజం గూగుల్ తన పేమెంట్స్ యాప్ గూగుల్ పే (Google Pay)ను ప్రమోట్ చేసిందన్న ఆరోపణలపై ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విచారణకు ఆదేశించింది. ఇతర నగదు చెల్లింపుల యాప్స్‌ను డామినేట్ చేస్తూ, గూగుల్ సొంత కంపెనీ యాప్ ‘గూగుల్ పే’ను ప్రమోట్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తుకు దారి తీసింది.
గూగుల్ కంపెనీ తన ప్లే స్టోర్ (Google Play Store) మరియు ఆండ్రాయిడ్ ఓఎస్‌లపై తన ప్రమేయం ద్వారా ఇతర పోటీ యాప్‌లకు బదులుగా నగదు చెల్లింపుల (Google pay Transactions)కు గూగుల్ పే వైపు మొగ్గు చూపుతోందని వాదనలు ఉన్నాయి. యూపీఈ ఇతర పేమెంట్ యాప్‌లకు ఇది అవరోధంగా మారిందని, ఇలాంటి కారణాలతోనే అగ్రస్థానంలోకి వచ్చిందని గూగుల్‌పై చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం నిబంధనల ఉల్లంఘన అవుతుందని సీసీఐ పేర్కొంది.
Also Read : Delete These Dangerous Apps: ఈ 7 డేంజరస్ యాప్స్‌ను తక్షణమే Delete చేయండి
విచారణ చేపట్టాలని డైరెక్టర్ జనరల్‌కు సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. చట్టంలోని సెక్షన్ 26(1) ప్రకారం విచారణ చేపట్టాలని సూచించింది. దీనిపై విచారణ చేపట్టిన 60 రోజులల్లో దర్యాప్తు నివేదిక సమర్పించాలని సీసీఐ సూచించింది.
Avika Gor Love Story: ప్రియుడ్ని పరిచయం చేసిన అవికా గోర్.. జంట ఫొటోలు వైరల్
పోటీ పేమెంట్ యాప్ కంపెనీల ఆరోపణలపై గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ స్పందించాయి. జీ పే యాప్ (Google Pay)నకు సెర్చ్ ర్యాంకింగ్స్‌లో గూగుల్ ఏమాత్రం సాయం చేయలేదని స్పష్టం చేశారు. సంబంధిత విషయాలను మాత్రమే సెర్చింగ్‌లో కనిపించేలా గూగుల్ పనిచేస్తుందన్నారు. గూగుల్ పే యాప్‌నకు మాత్రమే గూగుల్ మద్దతిచ్చిందన్నది తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు.
Also Read : KBC 12: రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe