How To Use WhatsApp Pay | భారత దేశంలో వాట్సాప్ తన వాట్సాప్ పేమెంట్ ప్రారంభించింది. అంటే ఇకపై వాట్సాప్ లో చాటింగ్ తో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా సాగుతాయి. WhatsApp Paymentలో UPI ద్వారా డబ్బులను మీరు పంపించవచ్చు. ఇది మిగితా యూపీఐ యాప్స్ లాగే పని చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Aadhaar Lock & Unlock: మీ ఆధార్ దుర్వినియోగం అయిందా ? ఇలా లాక్ చేసి అన్ లాక్ చేయండి!


వాట్సాప్ పేమెంట్ ( WhatsApp Payment ) వాడే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. ఈ రోజు మీకు ట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు తెలియజేస్తున్నాము.


1. వాట్సాప్ మీ నుంచి మీ బ్యాంకు వివరాలు కోరుతూ, పేమెంట్ సెట్ చేసుకునేందుకు ఎలాంటి ప్రత్యేకమైన వివరాలు కోరదు. మీ వివరాలు కోరుతూ కాల్స్ లేదా మెసేజెస్ వస్తే, వాట్సాప్ పేమెంట్ సెట్ చేసుకునేందుకు మీకు సహాయం చేస్తామని ఎవరైనా కాల్ చేస్తే అది ఫ్రాడ్ అని తెలుసుకోండి. ఇలాంటి కాల్స్ నుంచి జాగ్రత్త. 



ALSO READ|  WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే


2. వాట్సాప్ పేమెంట్ సర్వీసెస్ ఎలాంటి కస్టమర్ కేర్ నెంబర్ మెయింటేన్ చేయడం లేదు. అలాంటప్పుడు గూగుల్ లో ( Google) వాట్సాప్ పేమెంట్ కస్టమర్ నెంబర్ అంటూ కనిపిస్తే ప్రయత్నించకండి. పేమెంట్ సంబంధిత సమస్యలు ఉంటే మీ బ్యాంకును కాంటాక్ట్ చేయండి. 


3. ఎవరైనా వాట్సాప్ పేమెంట్ నుంచి కాల్ చేస్తున్నాం.. లేదా ఇది మా కస్టమర్ కేర్ నెంబర్ అని సంప్రదిస్తే జాగ్రత్త. అది మోసపూరిత కాల్ అవ్వవచ్చు.


4. పే బటన్ ట్యాప్ చేసిన తరువాత మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో మీకు వాట్సాప్ పేమెంట్ రిక్వెస్ట్ వస్తే.. మీరు Pay బటన్ క్లిక్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. 



Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!


5. వాట్సాప్ పై పేమెంట్ చేయడానికి మీ కార్డు వివరాలు ఓటీపి ( OTP ) , యూపీఐ ( UPI ) వంటి వివరాలు షేర్ చేయకండి. బ్యాంకింగ్ నేరాలు జరగవచ్చు.


6. వాట్సాప్ పై అంటూ వచ్చే టెక్ట్స్ లింక్స్ పై క్లిక్ చేయకుండా జాగ్రత్త పడండి. ఈ లింక్స్ వాడటం వల్ల మీ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు ట్రాన్ఫర్ అయ్యే అవకాశం ఉంది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR