Fake New Check: ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త బాగా షేర్ అవుతోంది. దాన్ని చదివి చాలా మంది చర్చలు కూడా మొదలు పెట్టారు. డిసెంబర్ 1న భారతదేశంలో మళ్లీ లాక్డౌన్ ( Lockdown ) విధించనున్నారు అనేది అందులో సారాంశం. దేశ వ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ మరింత వేగం పుంజుకుంది అందుకే లాక్డౌన్ తప్పదు అనేది అందులో ఉంది.
Also Read | False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్సైట్ తో జాగ్రత్త!
అలాంటి ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. అయితే అందులో ఉన్నట్టు లాక్డౌన్ విధించే దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ( Social Media ) ఈ వార్త గుప్పుమంటోండటంతో ప్రభుత్వ ప్రెస్ అయిన ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో ( PIB ) స్పందించింది. అది మార్ఫింగ్ చేసిన చిత్రం అని అందులో కించిత్ నిజం లేదు అని క్లారిటీ ఇచ్చింది.
Also Read | Google Photos: వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ ఫోటోస్ ఫ్రీ వర్షన్ మార్పులు
అవాస్తవ వార్త గురించి పీఐబి స్పందిస్తూ " దేశ వ్యాప్తంగా కోవిడ్-19 ( Covid-19 ) కేసులు బాగా పెగుతున్నందున ప్రభుత్వం డిసెంబర్ 1వ తేదీ నుంచి లాక్డౌన్ విధిస్తునట్టు ఒక పెద్ద మీడియా సంస్థ పోస్ట్ చేసింది. అయితే దీని గురించి పరిశీలించగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు అని తెలిసింది" అని ట్వీట్ చేసింది.
A tweet allegedly posted by a prominent media outlet claims that due to the growing number of #COVID19 cases in the country, the Govt. is going to re-impose a nationwide lockdown from 1st December#PIBFactCheck: This tweet is #Morphed. No such decision has been taken by the Govt pic.twitter.com/8Urg7ErmEH
— PIB Fact Check (@PIBFactCheck) November 12, 2020
Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్! ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి
ఇలాంటి అసత్య ప్రచారాలు, అవాస్తవ వార్తల గురించి ప్రజలకు సరైన సమాచారం అందించడానికి ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో డిసెంబర్ 2019 ఫాక్ట్ చెక్ టీమ్ ను లాంచ్ చేసింది. సోషల్ మీడియాలో వ్యాపించే అసత్య ప్రచారాలను నిలువరివంచడానికి ఇలా ప్రయత్నిస్తోంది.
Also Read | Diwali 2020 Car Buying: ఈ దీపావళికి కార్లు కొంటున్నారా ? రూ.4 లక్షల్లోపు బడ్జెట్ కార్లు చూడండి
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR