Actress Jayaprada: కోర్టులో లొంగిపోయిన ప్రముఖ నటి, మాజీ బీజేపీ ఎంపీ జయప్రద..
Former Rajya Sabha MP: సీనియర్ సినీ నటి, బీజేపీ మాజీ ఎంపీ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ కోర్ట్ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల సమయంలో ఆమె అనేక పర్యాయాలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆమెకు కోర్టు పలుమార్లు నోటీసులు జారీచేసింది.
Former BJP MP Jaya Prada Surrenders In Rampur Court: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ సోమవారం నాడు తన లాయర్లతో కలిసి ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ కోర్టుకు చేరుకున్నారు. ఆతర్వాత న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో అనేక సార్లు ఎన్నికల కోడ్ ను పట్టించుకోకుండా వివాదస్పదంగా వ్యవహరించారని ఆమెపై కేసులు నమోదయ్యాయి. దీన్ని విచారించడానికి కోర్టు ఆమె కు అనేక మార్లు నోటీసులు పంపింది. కానీ జయ ప్రద కోర్టు ఆదేశాలను ఏమాత్రం కూడా ఖాతారు చేయలేదు. దీంతో దీన్ని తీవ్రంగా పరిగణించినకోర్టు ఫిబ్రవరి 27న నాన్ బెయిల్ వారంట్ జారీచేసింది.
Read More: Samantha Ruth Prabhu: బాత్రూమ్‌లో హాట్ హాట్ ఫోజులిచ్చిన సమంత
2019 ఎన్నికలలో జయప్రద.. బీజేపీ నుంచి రాంపుర్ నుంచి ఎంపీగా పోటీచేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి అతిక్రమించినట్లు ఆమెపై కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీసు స్టేషన్ లలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఏడుసార్లు పోలీసులు వారెంట్ జారీచేసిన ఆమె స్పందించలేదని సమాచారం.
ఈ క్రమంలో సీరియస్ అయిన కోర్టు ఆమెపై నాన్ బెయిల్ వారెంట్ ను జారీచేసింది. ఆమె ఎక్కడున్న కూడా వెంటనే వెతికి తమ ముందు హజరు పర్చాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో.. జయప్రద అప్పటి నుంచి అబ్ స్కాండ్ అయ్యారు. తాజాగా, జయప్రద సోమవారం నాడు కోర్టులో హజరై అందరిని షాకింగ్ కు గురిచేశారు. ఇదిలా ఉండగా జయ ప్రద తెలుగు, తమిళం,కన్నడ, బెంగాలీ, హిందీ వంటి అనేక భాషల్లో దాదాపు.. 300 కు పైగా సినిమాల్లో నటించారు. 1994 లో టీడీపీ లో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook