Boat Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడటంతో 20 మంది మృతి చెందగా..మరో 20 మంది వరకూ గల్లంతయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. యమునా నదిలో పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 40-50 మంది వరకూ ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 20 మంది మరణించినట్టు..మరో 20 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. 


ఈ ప్రమాదం యూపీలోని బందా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళ్తుండగా జరిగింది. రాఖీ పండగ నిమిత్తం సొంత ఊర్లకు వెళ్తున్న క్రమంలో పడవ ప్రమాదానికి లోనైంది. సామర్ధ్యానికి మించి ప్రయాణీకులు పడవ ఎక్కడంతో బరువు ఎక్కువై నియంత్రణ కోల్పోయింది. ఫలితంగా బోల్తా పడింది. అటు నదిలో కూడా నీళ్లెక్కువగా ఉండటంతో పడవ పూర్తిగా మునిగిపోయింది. మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరగగా..ఇప్పటికే నాలుగు మృతదేహాల్ని వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పడవలో 25 మంది వరకూ మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. 


Also read: Jammu Encounter: ఆర్మీ క్యాంప్ పై ఆత్మాహుతి దాడి.. జమ్మూలో భీకర ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook