Threatening Calls to CM Yogi: రాజకీయ నాయకులకి అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో విరోధులు కూడా ఉంటారు. కింది స్థాయి రాజకీయ నాయకుల నుండి మొదలుకుని జాతీయ స్థాయి నాయకుల వరకు కూడా విరోధులు ఉండటం కామన్‌ విషయం. రాజకీయంగా విభేదించే వారు కొందరు అయితే.. వ్యక్తిగతంగా విభేదించే వారు కొందరు ఉంటారు. ఇండియాలో రాజకీయ హత్యలు అనేది తరచు చూస్తూనే ఉంటాం. ప్రధాని ఇందిరా గాంధీ మొదలుకుని ఎంతో మంది రాజకీయ ప్రముఖులు రాజకీయ హత్యలకు గురి అయ్యారు. అందుకే రాజకీయ నాయకులు ఏమాత్రం ప్రమాదం అని తెలిసినా కూడా జాగ్రత్తగా ఉంటారు. అంతే కాకుండా ప్రభుత్వాలు కూడా ఆ రాజకీయ నాయకులకు భద్రత పెంచడం జరుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్‌ ను హత్య చేయబోతున్నాం అంటూ 112 కి వచ్చిన మెసేజ్ తో అధికార యంత్రాంగం మరియు పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం యోగిని హత్య చేస్తామంటూ మెసేజ్ చేసిన వ్యక్తిని కొన్ని గంటల్లోనే గుర్తించి అరెస్ట్‌ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. అతడిపై ఐపీసీ 506, 507 సెక్షన్‌, ఐటీ యాక్ట్‌ 66 ప్రకారం కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని.. అతడి వెనుక ఉన్నది ఎవరు అనే కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా సీఎం యోగి ఆదిత్యానాథ్ కు ఇలాంటి హత్య బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పటికే సీఎం యోగికి అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. 


యోగి ఆదిత్యానాథ్‌ ని భవిష్యత్తు దేశ ప్రధాని అంటూ  ప్రచారం చేస్తున్న బీజేపీ శ్రేణులు తాజా పరిణామాల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యోగి కి ఉన్న ప్రాణ హాని నేపథ్యంలో ఆయనకు మరింతగా సెక్యూరిటీ పెంచాలని కూడా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ కేరళ పర్యటనలో ఉన్న సందర్భంగా కూడా ఆత్మాహుతి దాడి చేసి హత్య చేయబోతున్నాం అంటూ కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ సురేంద్రన్‌ కి లేఖ రాయడం జరిగింది. దాంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి లేఖ రాసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తానికి బీజేపీ ముఖ్య నేతలకు ఇలాంటి హెచ్చరికలు ఈమధ్య ఎక్కువ అయ్యాయి.


Also Read: Nellore Politics: సీఎం జగన్ ఫొటో రచ్చ.. నా చీర లాగారంటూ మహిళా మేయర్ ఆవేదన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.