'కరోనా వైరస్'.. ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహమ్మారి వైరస్ కారణంగా.. అంతా స్తబ్దుగా మారిపోయింది. ప్రపంచమే లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయింది. జనం ఇళ్ల నుంచి బయటకు రావడమే గగనంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితి ఉన్నవారి పరిస్థితి దారుణంగా మారింది. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు ఎదురైంది. 


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తండ్రి నిన్న ఉత్తరాఖండ్ లో మృతి చెందారు. ఐతే తండ్రి కడచూపునకు కూడా నోచుకోలేదు యోగీ ఆదిత్యనాథ్. బాధనంతా దిగమింగుకుని ఉత్తరప్రదేశ్ లోనే ఉండాల్సి వచ్చింది. దీనికి కారణం.. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్. అందుకే ఆయన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేదు. 


[[{"fid":"184639","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.. యోగీ ఆదిత్యనాథ్ తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయనకు కడసారి వీడ్కోలు చెప్పారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..