Steel Glass Removed from Patient Stomach: ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ పేషెంట్ తీవ్రమైన కడుపు నొప్పితో ఇటీవల ఆసుపత్రికి వెళ్లగా.. వైద్యులు అతని కడుపులో ఒక స్టీల్ గ్లాసును గుర్తించారు. సర్జరీ ద్వారా అతని కడుపు నుంచి స్టీల్ గ్లాసును తొలగించారు. స్టీల్ గ్లాసు కడుపులోకి ఎలా వెళ్లిందని వైద్యులు ఆ పేషెంట్‌ను ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. మల ద్వారం ద్వారానే ఆ స్టీల్ గ్లాసు కడుపులోకి వెళ్లిందని వైద్యులు నిర్దారించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా గోత్వా భతౌలీ గ్రామానికి చెందిన సమర్‌నాథ్ కొన్నాళ్లుగా హెర్నియాతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతను కొద్దిరోజులుగా కాలకృత్యాలు కూడా తీర్చుకోలేకపోతున్నాడు. ఇటీవల కడుపునొప్పి తీవ్రమవడంతో జౌన్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చూపించుకున్నాడు.


అక్కడి వైద్యులు సమర్‌నాథ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రే రిపోర్టులో అతని పొత్తి కడుపు భాగంలో పెద్ద స్టీల్ గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు. మొదట అతని మలద్వారం గ్లాసును బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో వైద్య బృందం అతనికి సర్జరీ నిర్వహించి కడుపు నుంచి స్టీల్ గ్లాసును బయటకు తీశారు. 


సమర్‌నాథ్‌కు సర్జరీ చేసిన డా. లాల్ బహదూర్ మాట్లాడుతూ.. స్టీల్ గ్లాసు కడుపులోకి ఎలా వెళ్లిందని అతన్ని అడిగామన్నారు. అందుకు అతను ఏదేదో చెప్పాడని.. అది నమ్మశక్యంగా అనిపించలేదని అన్నారు. మలద్వారం ద్వారానే అది కడుపులోకి వెళ్లి ఉంటుందని భావిస్తున్నామన్నారు. 


Also Read: CM KCR LIVE UPDATES: తెలంగాణలో సంచలనం జరగబోతోందా! సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్..


Also Read: Mars Transition 2022: రక్షా బంధన్‌కు ఒకరోజు ముందు కీలక పరిణామం.. ఆ 4 రాశుల వారి జీవితంలో జరగబోయే మార్పులివే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook