Mars Transition 2022: రక్షా బంధన్‌కు ఒకరోజు ముందు కీలక పరిణామం.. ఆ 4 రాశుల వారి జీవితంలో జరగబోయే మార్పులివే..

Mars Transition 2022: రక్షా బంధన్‌కు ఒకరోజు ముందు అంగారకుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం నాలుగు రాశుల వారి జీవితంలో పలు మార్పులు తీసుకురానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2022, 05:32 PM IST
  • ఆగస్టు 10న మేష రాశి నుంచి వృషభ రాశిలోకి అంగారకుడు
  • అంగారకుడి ప్రభావం నాలుగు రాశుల వారిపై
  • ఆ నాలుగు రాశుల వారికి కలిగే ఫలితాలివేత
Mars Transition 2022: రక్షా బంధన్‌కు ఒకరోజు ముందు కీలక పరిణామం.. ఆ 4 రాశుల వారి జీవితంలో జరగబోయే మార్పులివే..

Mars Transition 2022: గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెల 10న అంగారకుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది జరిగిన మరుసటిరోజే రాఖీ పౌర్ణమి రానుంది. ఈసారి కొన్నిచోట్ల రాఖీ పౌర్ణమిని ఆగస్టు 11న, మరికొన్ని చోట్ల 12న జరుపుకుంటున్నారు. పౌర్ణమి రోజునే రాఖీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి పౌర్ణమి నాడు భద్రకాలం కారణంగా మరుసటిరోజు రాఖీ పౌర్ణమి వేడుక జరుపుకుంటున్నారు. రాఖీ పౌర్ణమికి ముందు అంగారక రాశి మార్పు రాశిచక్రంలోని రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం... 

ఈ 4 రాశుల వారిపై అంగారక ప్రభావం :

వృషభం (Taurus) : మేష రాశిలో అంగారకుడు సంచరించే కాలంలో వృషభ రాశి వారికి అన్నివిధాలా కలిసొస్తుంది. ప్రత్యర్థులపై ఈ రాశుల వారు పైచేయి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు చకచకా పూర్తవుతాయి. కెరీర్‌లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :  ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి అన్నివిధాలుగా కలిసొస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కోరుకున్న జాబ్ దొరుకుతుంది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు, అప్పులు తొలగిపోతాయి.

వృశ్చికం (Scorpio) : ఉద్యోగ, వ్యాపారస్తులకు శుభకాలం. వ్యాపారస్తులు మునుపటి కన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఆర్థికపరంగా డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. 

మకరం (Capricorn): అంగారకుడు మేష రాశిలో సంచరించే కాలంలో మకర రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇన్నాళ్లు మీకు రావాల్సిన డబ్బును ఇవ్వకుండా మొండికేసినవారు తిరిగి ఆ డబ్బును చెల్లిస్తారు. మీ ఓపిక, దయాగుణం మీ పట్ల ఇతరులకు గౌరవాన్ని పెంచుతుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండవచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Uma Maheshwari Death: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మృతిపై పోస్టుమార్టమ్ రిపోర్ట్.. ఏం తేలిందంటే..

Also Read: Bimbisara: అప్పట్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన బింబిసార డైరెక్టర్.. ఏ సినిమానో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News