Hatras stampede: హత్రాస్ ఘోరం.. ఎవరీ భోలే బాబా..?.. ఆ మట్టికి అంత క్రేజ్ ఎందుకు..?
Uttar pradesh: హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం ఘోరం చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక్కసారిగా విషాదకరంగా మారిపోయింది. దీనిపై ప్రధాని మోదీతో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Hathras stampede Tragedy here bholebaba and satsang details: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రతీఖాన్‌పూర్‌లో మంగళవారం భొలేబాబా ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదకరంగా మారింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున భక్తులు అక్కడి భోలా బాబా దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఒకరిమీద మరోకరు పడిపోయి ఊపిరాడకుండా చనిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడి ఆస్పత్రులన్ని కూడా శవాలదిబ్బగా మారాయి.
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
కనీసం ఆస్పత్రులలో కూడా సరైన వైద్యుసదుపాయలు లేక బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా 120 మంది వరకు ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నారు.భోలో బాబా గా పిలుచుకునే నారాయణ సకార్ హరి సత్సంగంలో పాల్గొనడానికి భారీ ఎత్తున భక్తుల చుట్టు పక్కల గ్రామాల నుంచి తరలివచ్చారు. నిన్న (మంగళవారం) సత్సంగంలో చివరిరోజు కావడతో ఇంకా భక్తలు పొటేత్తారు. సత్సంగంలో సరైన సదుపాయాలు లేకపోవడం, సభావేదిక చిన్నదిగా ఉండటం, ఒకరిమీద మరోకరు పడటంతో ఈ దారుణం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎవరీ భోలే బాబా?
ప్రస్తుతం భోలే బాబాగా భక్తులతో పిలిపించుకునే సదరు బాబా.. గతంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసినట్లు చెప్పుకుంటారు. ఆయన ఎటా జిల్లా పాటియాలి తహసల్‌కు చెందిన బహదూర్ గ్రామానికి చెందిన వారు. ఆయనకు అతిచిన్న వయస్సులో దేవుడి మీద భక్తితో.. 26 ఏళ్ల క్రితమే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా సత్సంగాలు ప్రారంభించారు. భోలాబాబాకు.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఉన్నారు.
బోలో బాబా సత్సంగ కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రతి మంగళవారం నిర్వహిస్తుంటారు. దీనికి వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు అవసరమైన ఆహార, నీటి వసతులను వలంటీర్లే స్వయంగా ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాకుండా.. ఈ భోలే బాబాను దర్శించుకుంటే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని అక్కడివారు నమ్ముతుంటారు.
అంతేకాకుండా.. ఆయన పాదధూళిని ఇంట్లో పెట్టుకుంటే, నెగెటివ్ ఎనర్జీ దూరమైపోతుందని అక్కడి వారు విశ్వసిస్తుంటారు. ఆయన నడుచుకుంటూ వెళ్లిన తర్వాత.. అక్కడి మట్టిని కూడా కొందరు భక్తులు సేకరిస్తారు. తమతో పాటు ఆ మట్టిని ఇంటికి తీసుకెళ్తారు. చిన్న పిల్లలకు బొట్టులాగా కూడా పెడుతారంట. అందుకే భోలా బాబా పాదాలను తాకాలని, ఆ మట్టిని తీసుకునేందుకు భక్తులు ఎగబడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
Read more: Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..
రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్బ్రాంతి..
హత్రాస్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా మృతి చెందిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేకాకుండా.. పార్లమెంట్ లో కూడా ఈ ఘటనలో ప్రాణాలు వదిలిన వారికి నివాళులు అర్పించారు. ఈ ఘటన మాత్రం దేశంలో తీవ్ర విషాదకరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి