UP New Jail Manual: జైళ్ల శాఖ సంస్కరణలపై ఫోకస్ చేసిన ఉత్తరప్రదేశ్ సర్కార్ జైళ్లలో ఖైదీలకు సంబంధించిన మాన్యువల్‌లో కీలక సవరణలు చేసింది. ఈ మేరకు కొత్త మ్యానువల్‌కు యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త  మాన్యువల్ ప్రకారం ఇకపై జైళ్లలో మహిళా ఖైదీలు మంగళసూత్రాలు ధరించవచ్చు. అంతేకాదు, కార్వా చౌత్, తీజ్ వంటి పండగలను జరుపుకోవచ్చు. ఖైదీల పట్ల మానవతా దృక్పథంతో, సున్నితత్వంతో వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈ కొత్త మాన్యువల్‌ను తీసుకొచ్చామని యూపీ మంత్రి ధరమ్ వీర్ ప్రజాపతి వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీ జైళ్ల శాఖ కొత్త మాన్యువల్‌ ఇదే:


మహిళా ఖైదీలకు జన్మించే పిల్లల జనన నమోదు చేస్తారు. పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్లన్నీ ఇస్తారు. అంతేకాదు, నామకరణ వేడుక కూడా జరుపుతారు.
బ్యారక్స్‌లో మహిళా ఖైదీలతో ఉండే వారి పిల్లల చదువుల కోసం టీచర్‌ను నియమిస్తారు. అలాగే, చిల్డ్రన్ పార్క్స్‌ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎక్కువ సమయం గడిపేలా చేయడం ద్వారా జైలు ఖైదీల మధ్య నేరపూరిత సంభాషణలు పిల్లలు వినకుండా చేస్తారు.
జైల్లో తల్లులతో ఉండే పిల్లల కోసం ఎంటర్టైన్‌మెంట్, స్పోర్ట్స్ సదుపాయాలు కూడా కల్పిస్తారు.
పాలిచ్చే తల్లులకు పోషకాహారంతో కూడిన డైట్‌తో పాటు మందులు అందిస్తారు.
జైళ్లలో ఖైదీల కోసం బేకరీలు కూడా ఏర్పాటు చేస్తారు. 
భోజనంలో ప్రతీరోజూ చట్నీలు, ప్రతీ సాయంత్రం టీ బిస్కెట్ అందిస్తారు.
ఈద్ బక్రీద్ పండగ పూట శేమియా, హోళీ, దీపావళీ పండుగల సమయంలో ఖీర్‌ను ఖైదీలకు అందిస్తారు.
ఉపవాసం ఉండే ముస్లిం ఖైదీలకు ఖర్జూర పండ్లు అందిస్తారు. 
వేప పుల్లలకు బదులు పళ్లు తోముకునేందుకు టూత్ పౌడర్ అందిస్తారు. టూత్ పేస్ట్, టూత్ బ్రష్ వంటివి జైలు క్యాంటీన్ నుంచి కొనుగోలు చేయొచ్చు.
రక్త సంబంధీకులు నెలకొకసారి జైలుకు వచ్చి కలిసే అవకాశం కల్పిస్తారు. ఒకవేళ బంధువులు ఎవరైనా వేరే జైళ్లలో ఉంటే.. వారితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కల్పిస్తారు.
రిమాండ్ ఖైదీలకు ఇకపై బేడీలు వేయడం, లేదా చైన్లతో కట్టివేయడం ఉండదు.


కాగా, ఉత్తరప్రదేశ్‌లో 75 జైళ్లు ఉన్నాయి. 62 వేల మంది ఖైదీలను ఉంచే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడి జైళ్లలో కెపాసిటీకి మించి ఖైదీలు ఉన్నారు. దాదాపు 1.18 లక్షల మంది ఖైదీలు ఉన్నారు. దేశంలో ఇప్పటికీ స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న మ్యానువల్‌నే ఫాలో అవుతున్నందునా కొత్త మ్యానువల్‌ను తీసుకొచ్చినట్లు యూపీ సర్కార్ చెబుతోంది. 
 



Also Read: KCR Munugode Meeting Live Updates: మునుగోడు సభకు బయలుదేరిన కేసీఆర్.. 4 వేల కార్లతో భారీ కాన్వాయ్    


Also Read: Mahesh Babu Bare body : మొట్టమొదరిసారిగా షర్ట్ లేకుండా దర్శనమిచ్చిన మహేష్ బాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook