లక్నో: కరోనా వైరస్‌ను నియంత్రించడానికి లాక్ డౌన్ విధించడంతో జనం అంతా ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితమయ్యారు. జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకుంటూ పోలీసులు అహర్నిశలు కృషిచేస్తోన్నారు. అవసరమైన వారికి ఆహార పొట్లాలు అందిస్తూ వారి ప్రాణాలు నిలబెడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ పోలీసులు ఏకంగా మరో అడుగు ముందుకేసి ఓ వృద్ధురాలి మృతదేహానికి అన్నా తామై అంత్యక్రియలు కూడా చేశారు. సహ్రాన్‌పూర్ జిల్లాలోని బడ్గావ్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం మీన అనే ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆ వృద్ధురాలికి నా అనేవాళ్లు ఎవ్వరూ లేకపోవడంతో వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను కూడా పోలీసులే తమ భుజాన వేసుకున్నారు. పాడె కట్టి వృద్ధురాలి శవాన్ని భుజాలపై మోసుకుంటూ శ్మశానానికి వెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Tablighi Jamaat Markaz: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు


బద్గావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కిషన్‌పూర్ గ్రామానికి చెందిన మీన భర్త నాలుగేళ్ల క్రితమే చనిపోయారు. ఆమెకు ఎవ్వరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత కొన్ని నెలలుగా మీన అనారోగ్యంతో మంచం ఎక్కింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. చికిత్స పొందుతున్న మీన బుధవారం తుది శ్వాస విడవడంతో పోలీసులే గ్రామస్తుల సహాయంతో ఆ వృద్ధురాలికి అంత్యక్రియలు పూర్తి చేశారు. Also read: Lockdown worries:భారతీయులను కరోనా కంటే ఎక్కువ వేధిస్తున్న అంశాలివే



సహ్రాన్‌పూర్ జిల్లా ఎస్ఎస్పీ దినేష్ కుమార్ ప్రభు ఆ వీడియోను ట్విటర్ ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకున్నారు. మానవత్వంతో తమ పోలీసు సిబ్బంది చేసిన ఈ గొప్ప పనిని ప్రశంసిస్తూ ఎస్ఎస్పీ దినేష్ ప్రభు ఈ వీడియోను పోస్ట్ చేశారు. పోలీసుల దయా గుణానికి నెటిజెన్స్ సైతం వారిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. 


 


Also read: Doctor dies of COVID-19: కరోనాతో డాక్టర్ మృతి.. ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్


కరోనా వైరస్ కారణంగా పేదోళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి పట్ల పోలీసులు మానవత్వంతో వ్యవహరించాలి కానీ కఠినంగా వ్యవహరించకూడదంటూ తరచుగా ఎస్ఎస్పీ దినేష్ కుమార్ ప్రభు తమ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. తమ జిల్లా పోలీసు బాస్ చేస్తోన్న విజ్ఞప్తులు, సూచనల వల్లే సహ్రాన్ పూర్ పోలీసులు పేద వారి పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..