Unnao Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృత్యువాత పడ్డారు, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు, పాల ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తు నిశిలోనే ఆయువు తీసింది. డ్రైవర్‌ నిద్ర మత్తు ఈ ప్రమాదానికి కారణని తెలుస్తోంది. ఉన్నావ్‌లోని లక్నో- ఆగ్రా హైవేపై బస్సు వెళ్తుండగా మిల్క్‌ ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 18 మంది మృత్యువాత పడ్డారు, మరో 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన లక్కో ఎక్స్‌ప్రెస్‌వే పై చోటు చేసుకుంది. మృతుల్లో  ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  బస్సు ప్రయాణం సమయంలో మొత్తం 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. బుధవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగనల్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే కారణమని చెబుతున్నారు. మృతదేహాలను గుర్తించి, పోస్టుమార్టం ప్రారంభించే చర్యలు చేపట్టారు. అంతేకాదు ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయింది.


ఇదీ చదవండి: అమరుడి భార్యపై అసహ్యమైన కామెంట్లు.. తీవ్రంగా స్పందించిన మహిళ కమిషన్..


ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన ముజాఫర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని జరిగింది. ఘటనపై యోగీ ఆధిత్యనాథ్‌‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు త్వరగా చేపట్టాలని అధికారులను కూడా ఆదేశించారు.


ఇదీ చదవండి:  గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్, 300 రూపాయలు తగ్గనున్న సిలెండర్ ధర



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి