Uttarakhand Assembly Passes UCC Bill: ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  దీంతో ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లును సభ ఆమోదించింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర  వేస్తే స్వాతంత్ర్యం తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేయనున్న మెుదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఇదే బాటలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా యూసీసీ బిల్లును అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. గోవాలో ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులో ఉంది. అయితే అది పోర్చుగీస్ కాలం నాటిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ కమిటీ నివేదిక ఆధారంగానే..


2022 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసి బిల్లును అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారం చేపట్టిన ధామీ సర్కారు యూసీసీ అమలు కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా పి దేశాయ్ అధ్యక్షతన ఓ కమిటీని వేసింది. రెండేళ్లు కసరత్తు చేసిన కమిటీ గత శుక్రవారం ఈ ముసాయిదా ప్రతిని సమర్పించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.


అదే బాటలో మరిన్ని రాష్ట్రాలు..


లోక్ సభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ మెుదలైంది. ఇలాంటి చట్టాన్ని జాతీయ స్థాయిలో తీసుకురావాలని మోదీ సర్కారు ఎప్పటి నుంచో యోచిస్తోంది. గుజరాత్ మరియు అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇదే చట్టాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు మరియు అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు యూనిఫాం సివిల్ కోడ్ బీజేపీ యొక్క అజెండా అంశాలలో ఒకటి.


Also Read: ISRO Recruitment 2024: పది పాసైనవారికి బంపర్ ఆఫర్.. ఇస్రోలో జాబ్స్.. రూ.80,000 జీతం..


Also Read: Viral Video: పావు గంట సేపు రైలును ఆపేసిన హంస, ట్రెండింగ్ లో వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి