Uttarakhand bus accident: ఉత్తరాఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. చార్ ధామ్ యాత్రికులతో వెళుతున్న బస్సు.. ఆదివారం సాయంత్రం లోయలో పడింది. ఉత్తరాఖండ్‌ యమునోత్రి హైవేపై ఉన్న ఉత్తరకాశీ జిల్లా డామ్టా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 2 వందల మీటర్ల లోతులోకి బస్సు పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది ఈ ఘటనలో 25 మంది యాత్రికులు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ తో పాటు మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో కేవలం ముగ్గురు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాద సమచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వాళ్లను రక్షించి హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలను వెలికితీశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయాణికులంతా మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. లోయలో పడిన తర్వాత బస్సు రెండు భాగాలుగా విడిపోయింది. గాయపడినవాళ్లను డామ్టా, నౌగావ్‌లలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కు తరలించారు. పన్నా నుంచి మొత్తం మూడు బస్సుల్లో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లారు. అందులో ఒక బస్సు ప్రమాదానికి గురై లోయలో పడిపోయింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించారు.


ఉత్తరాఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారం పీఎం కేర్ నుంచి ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌ తెలిపారు.


READ ALSO: Hyderabad Gang Rape: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు? గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు..


READ ALSO: Hyderabad Rape Case: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. వీడియోలు షేర్ చేసిన వ్యక్తికి నోటీస్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook